News July 7, 2024
ఒకే ఓవర్లో 4, 6, 4, 6, 4
జింబాబ్వేతో జరుగుతున్న 2వ టీ20లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొడుతున్నారు. మయర్స్ వేసిన 11వ ఓవర్లో 4, 6, 4, 6, 4 వరుస బౌండరీలు బాదారు. మరో వైడ్ 2, 2 రావడంతో ఆ ఓవర్లో మొత్తం 28 రన్స్ వచ్చాయి. దీంతో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు. 12.2 ఓవర్లకు భారత్ 120/1 రన్స్ చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(81), రుతురాజ్(33) ఉన్నారు.
Similar News
News October 15, 2024
హీరో దర్శన్‌కు మరోసారి చుక్కెదురు
కన్నడ హీరో దర్శన్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సెషన్స్ కోర్టు కొట్టివేసింది. కాగా దర్శన్‌ను బళ్లారి జైలు నుంచి బెంగళూరు జైలుకు తరలిస్తారని వార్తలు వస్తున్నాయి. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, బెంగళూరులో చికిత్స అందించాలని దర్శన్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు తెలుస్తోంది.
News October 15, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: అక్టోబర్ 15, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:57 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:09 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:02 గంటలకు
అసర్: సాయంత్రం 4:17 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:54 గంటలకు
ఇష: రాత్రి 7.07 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 15, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.