News July 7, 2024
రింకూ మెరుపులు.. భారత్ భారీ స్కోర్ 234/2

జింబాబ్వేతో తొలి టీ20లో తడబడ్డ భారత బ్యాటర్లు రెండో టీ20లో చెలరేగి బ్యాటింగ్ చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(100) సెంచరీ, రుతురాజ్ గైక్వాడ్(77) హాఫ్ సెంచరీతో రాణించారు. చివర్లో రింకూ సింగ్(48) తనదైన స్టైల్‌లో బౌండరీలతో మెరుపులు మెరిపించారు. తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్(2) ఈసారి విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 2 వికెట్ల నష్టానికి 234 రన్స్ చేసింది.
Similar News
News March 20, 2026
ఏప్రిల్ 2న టెన్త్ ఇంగ్లిష్ పరీక్ష: విశాఖ డీఈవో

మార్చి 21న ప్రభుత్వం రంజాన్‌గా ప్రకటించిన నేపథ్యంలో ఆరోజు జరగాల్సిన టెన్త్ పరీక్షను వాయిదా వేసినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ అంశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తించాలని ఆయన కోరారు.
News March 20, 2026
పెరిగిన ‘పవర్’ పెట్రోల్ ధర

దేశవ్యాప్తంగా ‘పవర్’ పెట్రోల్ ధర పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలైన HPCL, BPCL, IOCL లీటర్‌పై రూ.2.09-రూ.2.35 వరకు వడ్డించాయి. ఈరోజు నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. నార్మల్ పెట్రోల్ రేట్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల క్రూడాయిల్ సరఫరా తగ్గడంతో రేట్లు సవరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వంటగ్యాస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.
News March 20, 2026
గుడ్ న్యూస్: డెయిరీ, గొర్రెల ఫారాలకు ఛార్జీల రద్దు

AP: రాష్ట్రంలోని డెయిరీ, గొర్రెలు, మేకలు, పందుల పెంపకందారుల నుంచి వసూలు చేస్తున్న బెటర్‌మెంటు, డెవలప్మెంటు ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక నుంచి వీటిని మినహాయిస్తున్నట్లు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే వీటికి సంబంధించి మున్సిపాల్టీల పరిధిలోని బిల్డింగ్ పర్మిషన్, లైసెన్స్ ఫీజులను పంచాయతీలతో సమానం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ మినహాయింపులపై GO ఇచ్చారు.


