News July 7, 2024
ప్రజాస్వామ్యాన్ని కాపాడిన అక్షరయోధులు రామోజీరావు: ఎంపీ లావు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య వైఫల్యాలపై నిరంతరం యుద్ధం చేసి ప్రజా విజయానికి కృషి చేసిన అక్షరయోధులు రామోజీరావు అని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఆదివారం గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జన చైతన్య వేదిక, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో అక్షరయోధులు రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు.
Similar News
News March 14, 2026
GNT: జాతీయ లోక్ అదాలత్.. 24,756 కేసులు క్లియర్

గుంటూరు కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 24,756 కేసులు పరిష్కరించబడినట్లు రెండవ అదనపు జిల్లా జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌ఛార్జ్ ఛైర్మన్ నాగరాజా తెలిపారు. 1,694 సివిల్ కేసులు, 22,983 క్రిమినల్ కేసులు, 79 ప్రీ-లిటిగేషన్ కేసులు ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద భీమా, చెక్ బౌన్స్ కేసుల్లో పరిష్కరమైన కేసుల మొత్తం విలువ సుమారు రూ.42.58 కోట్లుగా ఉందన్నారు.
News March 14, 2026
గుంటూరు: కోర్టు మెట్లపై మళ్లీ ఒక్కటైన ఆరు జంటలు

గుంటూరులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో వరకట్న వేధింపులు, భరణం కేసులతో కోర్టును ఆశ్రయించిన ఆరు జంటలను న్యాయమూర్తి లత చొరవతో తిరిగి కలిపారు. దంపతులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించి దాంపత్య బంధాన్ని కొనసాగించేందుకు ఒప్పించారు. న్యాయమూర్తి లత కృషిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ ప్రక్రియలో సహకరించిన న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
News March 14, 2026
తుళ్లూరు: CMరాక ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 16న తుళ్లూరులో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఈ కార్యక్రమంలో భాగంగా తుళ్లూరులో ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. తుళ్లూరులో ఆర్యవైశ్య ట్రస్టుకు ప్రభుత్వం కేటాయించిన 6.80 ఎకరాల స్థలంలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.


