News July 7, 2024
ఒంగోలు: 11న ఐటీఐ విద్యార్థులకు జాబ్ మేళా

ఒంగోలులోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కాలేజీలో ఈ నెల 11న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బాలికల ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ పి.ఉమామహేశ్వరిదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ చదువుతున్న, పాసైన అభ్యర్థులను ఉద్యోగం లేదా అప్రంటీస్ శిక్షణకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షణ భృతి చెల్లిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News January 2, 2026
మార్కాపురం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. మార్కాపురానికి చెందిన షేక్ కరీముల్లా(50), మాచర్లకు చెందిన నూర్జహాన్(45) బంధువులు. ఇద్దరూ ఫ్రూట్స్ బిజినెస్ చేస్తుంటారు. మాచర్ల నుంచి మార్కాపురానికి బైకుపై గురువారం బయల్దేరారు. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన మహేశ్ బైకుపై మాచర్లకు పయనమయ్యాడు. శిరిగిరిపాడు వద్ద ఈ రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కరీముల్లా, నూర్జహాన్ చనిపోగా మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు.
News January 1, 2026
మార్కాపురానికి CM రాక?

మార్కాపురం జిల్లాలో జనవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు రానున్నట్లు సమాచారం. వెలుగొండ ప్రాజెక్ట్ సందర్శన, ఫీడర్ కెనాల్ పనులను ప్రారంభించడానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మార్కాపురం జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రత్యేకతను సంతరించుకోనుందని చెప్పవచ్చు. కాగా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
News January 1, 2026
మార్కాపురం పర్యటనకు సీఎం చంద్రబాబు రాక?