News July 7, 2024

అరుణాచల గిరి దేవస్థానానికి వరంగల్ నుంచి స్పెషల్ బస్సులు

image

హనుమకొండ: అరుణాచల గిరి దేవస్థాన దర్శనానికి వెళ్లే భక్తులకి వరంగల్ వన్ డిపో నుంచి స్పెషల్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ విజయ భాను ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జులై 19న ఒక బస్సు బయలుదేరుతుందని, జులై 21న మధ్యాహ్నం మరో బస్సు బయలుదేరుతున్నట్లు ఆర్ఎం తెలిపారు. మరిన్ని వివరాల కోసం 98663 73825 నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.

Similar News

News October 2, 2024

బతుకమ్మను ఎత్తుకున్న ఎంపీ కడియం కావ్య

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. బతుకమ్మను ఎంపీ కడియం కావ్య ఎత్తుకొని కాసేపు బతుకమ్మ ఆడి సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని, బతుకమ్మ పండుగ వేడుకల్లో తొలిసారి ఎంపీగా పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు.

News October 2, 2024

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

image

పీపుల్స్ ప్లాజాలో సెర్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రకృతిలోని పూలను దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మనదని, బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

News October 2, 2024

పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

image

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపాలన విభాగం భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీలు, ఏసీపీలు సీఐలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ మార్గంలోనే నేటి యువత ప్రయాణించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.