News July 7, 2024
కొత్త చట్టం కింద MPపై కేసు నమోదు

TMC MP మొయిత్రాపై కొత్త క్రిమినల్ చట్టం కింద కేసు నమోదైంది. జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మపై అవమానకరంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే కారణంతో BNS సెక్షన్79 కింద కేసు నమోదైంది. ఇటీవల హాథ్రస్‌కు వెళ్లినప్పుడు తనకు ఓ వ్యక్తి గొడుగు పట్టగా రేఖాశర్మ ఖాళీ చేతులతో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోపై మొయిత్రా స్పందిస్తూ ‘ఆమె తన ఓనర్ పైజామాను పట్టుకోవడంలో చాలా బిజీగా ఉంది’ అని అన్నారు.
Similar News
News April 9, 2026
సొంత ఇల్లు, కారు లేవు.. దేశంలోనే పేద సీఎం మమత!

తనకు సొంత ఇల్లు, కారు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. 9.8 గ్రాముల బంగారం, రూ.75,700 నగదు ఉందని తెలిపారు. మొత్తంగా రూ.15.37 లక్షల ఆస్తులు ఉన్నట్లు ప్రస్తావించారు. దీంతో దేశంలో పేద సీఎంగా మమత నిలిచారు. ఆమె తర్వాతి స్థానాల్లో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(రూ.55 లక్షలు), కేరళం సీఎం పినరయి విజయన్(రూ.కోటి) ఉన్నారు.
News April 9, 2026
దాహమేస్తోందని అడగలేవు.. మనమే దప్పిక తీరుద్దాం!

ఎండాకాలంలో జంతువులు నీడ, నీరు లేక అల్లాడిపోతాయి. దాహమేస్తోందని అడగలేవు కూడా. అందుకే వాటి బాధను మనం అర్థం చేసుకుందాం. ఇందుకోసం మీరు చేయాల్సింది ఇంటి ముందర చిన్న తొట్టె లేదా బకెట్లో నీళ్లు నింపి పెట్టడమే. మండే ఎండల్లో దాహంతో ఉన్న పక్షులు, జంతువులు ఆ నీటితో కడుపు నింపుకుంటాయి.
Share It
News April 9, 2026
పురుషులకు ప్రవేశం లేని ఆలయాలూ ఉన్నాయ్: కేంద్రం

శబరిమలలోకి 10-50 ఏళ్ల మహిళల ప్రవేశంపై ఆంక్షలను కేంద్రం సమర్థించింది. ఇది వివక్ష కాదని, దశాబ్దాలుగా కొనసాగుతున్న <<19599264>>ఆచారాన్ని<<>> గౌరవించడమేనని తెలిపింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ వాదనలు వినిపించారు. దేశంలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలూ ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఇది పురుషాధిక్య/ స్త్రీ ఆధారిత విశ్వాసాలకు సంబంధించింది కాదన్నారు.


