News July 8, 2024

నేడు జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన

image

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కేతేపల్లి మండలం కొర్లపాడు గ్రామం (టోల్ ప్లాజా వద్ద), కనగల్ మండలం యేమిరెడ్డిగూడెంలో ట్రామా కేర్ సెంటర్లకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు మంత్రి హైదరాబాదుకు తిరుగు పయనమవుతారు.

Similar News

News March 16, 2026

నల్గొండ: ప్రజావాణికి పోటెత్తిన అర్జీలు

image

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి మొత్తం 105 వినతులు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 60, ఇతర శాఖలకు 45 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి, ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News March 16, 2026

నల్గొండ: దివ్యాంగుల కోసం ప్రతి నెలాఖరున ‘ప్రత్యేక ప్రజావాణి’

image

దివ్యాంగులు, వృద్ధుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల చివరి శనివారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ నెల 28న దీన్ని ప్రారంభిస్తున్నామని, దీనికి అదనంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రంజాన్ తోఫా పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

News March 16, 2026

నాగార్జునసాగర్ తీరంలో సైక్లింగ్ జోష్

image

అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు వచ్చే సందర్శకుల కోసం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాగర్ తీరంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సైక్లింగ్ ప్రారంభించారు. విజయవిహార్ అతిథి గృహంలో ప్రస్తుతానికి 10 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. పర్యాటకులు గంటకు రూ.100 చొప్పున చెల్లించి ఈ సైకిళ్లను వినియోగించుకోవచ్చు.