News July 8, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

➤ఉమ్మడి జిల్లా అధికారులు, MLAలతో మంత్రి సమీక్ష
➤కొయిలకొండ: యాక్సిడెంట్‌‌లో అన్నదమ్ములు మృతి
➤జడ్చర్ల: ఆలయ కోనేరు పూడ్చివేతపై డీకే అరుణ ఫైర్
➤నిరంజన్ రెడ్డిపై మధుసూదన్ రెడ్డి ఫైర్
➤జిల్లా వ్యాప్తంగా MRPS ఆవిర్భావ వేడుకలు
➤అమనగల్లు ఎస్సై బదిలీ
➤బల్మూరు: ఫొటో గ్రాఫర్ ఆత్మహత్య
➤తిమ్మాజిపేట: కట్నం కోసం వేధింపులు.. భర్తపై కేసు

Similar News

News January 27, 2026

పాలమూరు: పేపర్లలో తప్పులుంటే అధికారులకు తెలపాలి: VC

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మూడో సెమిస్టర్ పరీక్షా కేంద్రాలను మంగళవారం ఉపకులపతి (VC) శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News January 27, 2026

MBNR: పెరిగిన ఉష్ణోగ్రతలు.. తగ్గుతున్న చలి

image

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాజాపూర్‌లో అత్యల్పంగా 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మూడు రోజులతో పోలిస్తే ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగాయి. జడ్చర్ల, మిడ్జిల్‌లో 15.1, భూత్పూర్‌లో 16.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రథసప్తమి ముగియడంతో ఇకపై ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

News January 26, 2026

మహబూబ్‌నగర్: పరేడ్ మైదానంలో పతాకావిష్కరణ

image

మహబూబ్‌నగర్ పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. కలెక్టర్ విజయేందిర బోయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ అమలు స్ఫూర్తితో వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.