News July 8, 2024

చిన్నపిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు ఉద్ధవ్?: మహారాష్ట్ర సీఎం

image

శివసేన(UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరేపై మహారాష్ట్ర CM ఏక్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమవైపే ఉన్నా ఇంకా శివసేన తమదేనంటూ ఉద్ధవ్ ఎందుకు చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారంటూ ప్రశ్నించారు. ‘పంచాయతీ ఎన్నికల్లో మేం 2వ స్థానంలో ఉంటే ఉద్ధవ్ పార్టీ 6వ స్థానానికి పరిమితమైంది. ఎంపీ ఎన్నికల్లోనూ మాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. బాలాసాహెబ్ ఆశయాలను వారు పక్కన పెట్టడం వల్లే ప్రజలు మావైపు నిలుస్తున్నారు’ అని పేర్కొన్నారు.

Similar News

News January 18, 2025

నేను నేరం చేయలేదు: కోర్టులో సంజయ్

image

కోల్‌కతా హత్యాచార ఘటనలో దోషిగా కోర్టు నిర్ధారించిన <<14530358>>సంజయ్ రాయ్<<>> తాను నిర్దోషిని అని వాదించాడు. ఈ రోజు కోర్టు తీర్పు వెల్లడించే ముందు జడ్జితో ‘నేను ఈ నేరం చేయలేదు’ అని చెప్పాడు. గతంలో కూడా ఇతడు ఇదే తరహా కామెంట్లు చేశాడు. అటు అతడు ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని రాయ్ కుటుంబం పేర్కొంది. కోల్‌కతాలోని శంభునాథ్ స్లమ్‌లో ఒక గదిలో ఉండే వీరి కుటుంబం.. పోరాడే శక్తి సైతం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

News January 18, 2025

పవన్ కళ్యాణ్ అభిమానులకు మళ్లీ నిరాశే?

image

హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాబిన్ హుడ్’ మార్చి 28న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఆయన నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సైతం అదేరోజున విడుదలకానుంది. నితిన్ మూవీ అప్డేట్‌తో HHVM వాయిదా పడుతుందనే వార్తలొస్తున్నాయి. అదే జరిగితే రాబిన్‌ హుడ్‌తో పాటు VD12, మ్యాడ్ స్క్వేర్ కూడా ఇదే తేదీలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

News January 18, 2025

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార కేసులో తీర్పు వెల్లడి

image

యావత్ దేశం చలించిన <<13905124>>అభయ<<>> హత్యాచార కేసులో సీల్దా కోర్టు తీర్పు వెల్లడించింది. సంజయ్ రాయ్‌ను దోషిగా తేలుస్తూ తీర్పిచ్చింది. కలకత్తా RG కర్ మెడికల్ కాలేజ్‌లో ట్రైనీ డాక్టర్ 2024 AUG 9న దారుణ అత్యాచారం, హత్యకు గురైంది. నిర్భయ తీవ్రతను తలపించేలా జరిగిన ఈ దుశ్చర్యపై CBI దర్యాప్తు జరిపి OCT 7న ఛార్జిషీట్ వేసింది. డైలీ విచారణ అనంతరం నేడు దోషిగా తేల్చిన జడ్జి అనిర్బన్ దాస్ సోమవారం శిక్ష ఖరారు చేయనున్నారు.