News July 8, 2024

కాంగ్రెస్ వాస్తవాన్ని తెలుసుకోవాలి: సింథియా

image

గుజరాత్‌లో బీజేపీని ఓడించి తీరుతామన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందించారు. కాంగ్రెస్ పగటికలల్ని కంటోందని ఎద్దేవా చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. ఓటర్లు వరసగా మూడోసారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయినా ఆ పార్టీ నేతలకు అహంకారం తగ్గలేదు. వాస్తవాన్ని గుర్తించండి. ఆ తర్వాత మాట్లాడండి’ అని హితవు పలికారు.

Similar News

News December 22, 2024

భారత్‌పై మరోసారి బంగ్లా ఆరోపణలు

image

మాజీ ప్రధాని షేక్ హ‌సీనా హ‌యాంలో ప్ర‌జ‌లు అదృశ్యమైన ఘ‌ట‌న‌ల్లో భార‌త్ హ‌స్తం ఉంద‌ని బంగ్లా ప్ర‌భుత్వ ఎంక్వైరీ క‌మిష‌న్ ఆరోపించింది. బంగ్లా ఖైదీలు భార‌తీయ జైళ్ల‌లో మ‌గ్గుతున్నార‌ని పేర్కొంది. భార‌త్‌లో నిర్బంధంలో ఉన్న తమ జాతీయుల‌ను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని బంగ్లాదేశ్ విదేశాంగ, హోం శాఖలకు క‌మిష‌న్ సిఫార్సు చేసింది. తమ పౌరులు 3,500 మంది అదృశ్యమైనట్టు కమిషన్ అంచనా వేసింది.

News December 22, 2024

రైల్వేలో పోస్టులు.. వివరాలివే

image

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వివిధ విభాగాల్లో 1036 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 7- ఫిబ్రవరి 6 మధ్యలో తమ <>వెబ్‌సైట్<<>> ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు రుసుం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.250 ఉంది. పోస్టుల్లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్‌కు 338 ఖాళీలుండగా అత్యల్పంగా సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 2 ఖాళీలున్నాయి.

News December 22, 2024

తెలుగు రాష్ట్రాల్లో తరుగుతున్న అటవీ సంపద!

image

దేశవ్యాప్తంగా అటవీ సంపద గణనీయంగా తగ్గిందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2021తో పోలిస్తే గత ఏడాది 138.66 చదరపు కిలోమీటర్లు, తెలంగాణలో 100.42 చ.కి అటవీ భూమి తగ్గిపోయిందని పేర్కొన్నారు. తొలి స్థానంలో మధ్యప్రదేశ్(371.54 చ.కి) ఉండగా రెండో స్థానంలో ఏపీ, మూడో స్థానంలో తెలంగాణ ఉండటం గమనార్హం.