News July 8, 2024
మరో రికార్డు సృష్టించిన ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’

ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ రికార్డుల ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటేసిందన్న వార్తలు వస్తుండగా తాజాగా మరో రికార్డు సొంతం చేసుకుంది. ‘బుక్ మై షో’ వెబ్‌సైట్‌లో ఈ ఏడాది కోటి టిక్కెట్లు అమ్ముడైన తొలిసినిమాగా నిలిచింది. లాంగ్ రన్‌లో ‘కల్కి 2898ఏడీ’ రూ. వెయ్యి కోట్ల గ్రాస్‌ను సులభంగా దాటేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Similar News
News March 21, 2026
HYDలో ఈ-సిగరెట్ల దందా.. 261 ప్రాంతాల గుర్తింపు

HYDలో ఈ-సిగరెట్ల దందా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈగల్ టీమ్ నివేదిక ప్రకారం.. సుమారు 261 ప్రాంతాల్లో వీటి అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. కళాశాలల పరిసరాలు, పాన్ దుకాణాలు, సిగరెట్ షాపుల వద్ద ఇవి విస్తృతంగా విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ-సిగరెట్లు ఆరోగ్యానికి తీవ్ర హానికరమని హెచ్చరిస్తూ, నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
News March 21, 2026
ఏకంగా 20 కోతుల దాడి.. అక్కడికక్కడే మృతి

తెలుగు రాష్ట్రాల్లో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా కాకినాడ జిల్లాలో ఓ వృద్ధురాలి ప్రాణం తీశాయి. ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంకు చెందిన చిన్న బుల్లెమ్మ(65) గేదెకు నీరు పెడుతుండగా కోతులు గుంపులుగా వచ్చి ఆమెపై దాడి చేశాయి. ఏకంగా 20 కోతులు ఒకేసారి మీద పడటంతో తప్పించుకొనే అవకాశం లేకుండా పోయింది. తీవ్రగాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మరి మీ దగ్గరా కోతుల బెడద ఉందా? కామెంట్ చేయండి.
News March 21, 2026
ఈనెల 23న ₹1.35లక్షల కోట్ల ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన

AP: రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడనుంది. ప్రతిష్ఠాత్మక ఆర్సెలార్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు ఈనెల 23న శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో ₹1,35,964 కోట్లతో ఇది ఏర్పాటు కానుంది. ఏటా 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తే లక్ష్యంగా 5,465 ఎకరాల్లో రెండు ఫేజుల కింద దీనిని నిర్మిస్తున్నారు.


