News July 8, 2024

వారానికి 5రోజులు శాకాహారం తీసుకోండి: రష్మి

image

ప్రజలందరూ వారంలో 5 రోజుల పాటు శాకాహార భోజనం తీసుకోవాలని యాంకర్ రష్మి ట్విటర్‌లో్ కోరారు. ‘గతంలో వారంలో 5 రోజులు శాకాహారమే తినేవాళ్లం. ఆదివారమో లేక ప్రత్యేక సమయాల్లో మాత్రమే నాన్ వెజ్ వండుకునేవాళ్లం. అప్పుడు ఆరోగ్యాలు బాగుండేవి. కానీ నేడు చిన్నవయసులోనే మరణాలు ఎక్కువయ్యాయి’ అని పేర్కొన్నారు. నాన్ వెజ్ తినకపోతే శరీరానికి సరిపడా ప్రొటీన్ అందదన్న ఓ నెటిజన్ కామెంట్‌కు రిప్లైగా ఆమె ఈ పోస్ట్ పెట్టారు.

Similar News

News November 5, 2025

NEET-SS దరఖాస్తులు ప్రారంభం

image

NEET-SS దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. DM/MCh, DrNB తదితర సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఈ నెల 25 వరకు NBEMS వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 26, 27 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 22న అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి. ఫలితాలను 2026 జనవరి 28 లోపు వెల్లడిస్తారు. పీజీ చేసిన వారు(MD/MS/DNB) దరఖాస్తుకు అర్హులు.

News November 5, 2025

ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

image

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా మరికల్ అడవుల్లో పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

News November 5, 2025

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

image

AP: అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పుట్లూరు నుంచి వెళ్తున్న బస్సు చింతకుంట వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. స్టీరింగ్ స్టక్ కావడంతో ఇలా జరిగినట్లు సమాచారం. బస్సులో ఎక్కువగా ఆదర్శ పాఠశాల, జడ్పీ పాఠశాల విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.