News July 8, 2024

నేడు ఇంధన శాఖపై శ్వేతపత్రం

image

AP: రాష్ట్ర ఇంధన శాఖ పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజల ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు విద్యుత్ రంగంపై నేడు వైట్‌ పేపర్‌ను విడుదల చేయనుంది. ఇంధన రంగాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు తీసుకునే చర్యల గురించి సీఎం చంద్రబాబు చెబుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి. 2019కి, నేటికి చోటుచేసుకున్న వ్యత్యాసాన్ని ప్రధానంగా వివరించనున్నారని పేర్కొన్నాయి.

Similar News

News March 11, 2026

స్టాక్ మార్కెట్లు క్రాష్

image

యుద్ధం ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఫ్లాట్‌గా స్టార్ట్ అయిన సూచీలు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,342 పాయింట్లు, నిఫ్టీ 394 పాయింట్లు కోల్పోయాయి. సన్ ఫార్మా, ఎన్టీపీసీ మినహా అన్ని కంపెనీల షేర్లు ఘోర నష్టాలు చవిచూశాయి. FII అమ్మకాలు, ప్రాఫిట్ బుకింగ్, ఇరాన్‌పై దాడులు కొనసాగుతుండడం మార్కెట్లపై ప్రభావం చూపించింది.

News March 11, 2026

యూజర్లకు షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్?

image

మొబైల్ డేటాపై ట్యాక్స్ విధించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధ్యయనం చేయాలని టెలికం విభాగాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇది ఆదాయం పెంచడంతో పాటు స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు దోహదం చేస్తుందని ఆలోచిస్తుందట. ఒక GB డేటాపై ₹1 ట్యాక్స్ వేసినా ఏటా ₹22,900 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ప్రస్తుతానికి ఇది చర్చల దశలోనే ఉంది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

News March 11, 2026

రాష్ట్రంలో మూడో డిస్కం

image

TG: రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటైంది. దీనికి తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TGRPDCL)గా పేరు పెడుతూ ప్రభుత్వం GO జారీ చేసింది. CMDగా ముషారఫ్ అలీ ఫరూఖీని, మరో నలుగురు డైరెక్టర్లను నియమించింది. వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలు, వాటర్ సప్లై స్కీమ్/మిషన్ భగీరథ, HMWSSB, మున్సిపల్ వాటర్ కనెక్షన్లకు విద్యుత్ సరఫరాను పర్యవేక్షించనుంది. కొత్త వ్యవసాయ కనెక్షన్లను ఇవ్వనుంది.