News July 8, 2024

నెల్లూరు: DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్

image

నెల్లూరు జిల్లాకు చెందిన SC, ST, BC కులాలకు చెందిన DSC అభ్యర్థులకు నెల్లూరులోని BC స్టడీ సర్కిల్‌ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నారని ఆ శాఖ అధికారి వెంకటయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 10తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ కాలంలో రూ.3 వేలు స్టైపెండ్, స్టడీ మెటీరియల్‌ అందజేస్తారన్నారు. వివరాలకు నగరంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్‌‌లో సంప్రదించాలని అన్నారు.

Similar News

News March 6, 2026

రాష్ట్రంలోనే కావలి టాప్

image

నెల్లూరు జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలోనే కావలిలో నిన్న అత్యధికంగా 39.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని అధికారులు పేర్కొన్నారు. అమరావతి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు కంటే ఎక్కువ కాస్తుందని తెలిపారు. ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

News March 6, 2026

నెల్లూరు: పదో తరగతి హాల్ టికెట్‌లో తప్పులు

image

రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన పదో తరగతి హాల్ టికెట్‌లో తప్పులు దొర్లినట్లు విద్యార్థులు తెలిపారు. మనుబోలు ZP హైస్కూల్లో చదువుతున్న వారికి పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని పక్కనే ఉన్న ZP బాలికల హైస్కూల్‌ను కేటాయిస్తారు. అయితే ఈసారి హాల్ టికెట్‌లో ZP బాలికల హైస్కూల్‌ కేంద్రం కోడ్‌ను వేసి, పరీక్షా కేంద్రం పేరు ZP హైస్కూల్ అని వచ్చిందన్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

News March 6, 2026

నెల్లూరు: చిన్నారిపై లైంగిక దాడికి యత్నం..

image

బాలిక(8)పై 40 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. TP గూడూరు (M)లో గిరిజన కుటుంబం నివసిస్తోంది. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లగా తమ్ముడితో కలిసి బాలిక ఇంట్లో ఉంటోంది. గుర్తుతెలియని వ్యక్తి, ఓ మహిళ బైక్‌పై వచ్చారు. బాలిక తమ్ముడికి మహిళ మాయమాటలు చెప్పి పక్కకు తీసుకెళ్లగా.. ఆ వ్యక్తి బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.