News July 8, 2024
గ్రూప్-1 ప్రిలిమ్స్ పాసైన తండ్రి, కొడుకు

TG: నిన్న వెలువడిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో తండ్రి, కొడుకు అర్హత సాధించారు. ఖమ్మం జిల్లాకు చెందిన రవికిరణ్(53) జాస్తిపల్లి హైస్కూల్‌లో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు మైకేల్(25) దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశారు. రిజర్వేషన్, ఇన్ సర్వీసు కోటాలో వయో పరిమితి ఎక్కువగా ఉండటంతో తండ్రి, అతని సూచనలతో తనయుడు పరీక్ష రాశారు. ఇద్దరూ మెయిన్స్‌కు అర్హత సాధించారు.
Similar News
News March 13, 2026
వారిద్దరూ పార్టీని చీల్చారు: దేవ్‌జీ

మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి వెనక పెద్ద కుట్ర ఉందని ఇటీవల లొంగిపోయిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జీ అన్నారు. ఆపరేషన్ కగార్ ప్రారంభం కాగానే నంబాల బాడీగార్డులు లొంగిపోయి ఇన్‌ఫార్మర్లుగా మారారని ఆరోపించారు. కీలక నేతలైన మల్లోజుల, ఆశన్న శత్రువులకు లొంగిపోయి ఆయుధాలు అప్పగించారని పేర్కొన్నారు. వీరిద్దరూ పార్టీని చీల్చారని ఆరోపించారు. తాము మాత్రం ఆయుధాలను అడవుల్లోనే వదిలేశామని చెప్పారు.
News March 13, 2026
ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధమైంది: ట్రంప్

తాము చేస్తున్న దాడులకు భయపడిపోయి ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధమైందని US అధ్యక్షుడు ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. 2 రోజుల కిందట G-7 దేశాల నేతలతో జరిగిన వర్చువల్ చర్చల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని Axios వెల్లడించింది. యుద్ధం కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయించేందుకూ ఇరాన్‌లో అధికారులెవరు బతికి లేరని ట్రంప్ చెప్పారు. ‘లీడర్ అంటూ ఎవరూ లేరు. అందుకే లొంగిపోవడం గురించి ఎవరూ ప్రకటించలేదు’ అని పేర్కొన్నారు.
News March 13, 2026
టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు ఇలా ప్లాన్ చేసుకోండి!

TG: టెన్త్ విద్యార్థుల బోర్డు పరీక్షలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి జరిగే పరీక్షల కోసం మొదటగా హాల్ టికెట్, పెన్నులు సిద్ధం చేసుకోండి. పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోండి. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి ప్రతి ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలో ముందే ప్లాన్ చేసుకోండి. మీకు బాగా వచ్చిన సమాధానాలను ముందుగా రాయండి. చివరి 10 నిమిషాల్లో రాసిన జవాబులన్నింటినీ ఓసారి సరిచూసుకోండి. ALL THE BEST


