News July 8, 2024
నిజామాబాద్ జిల్లాలో డేంజర్ బెల్స్

NZB జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గత 6 నెలల నుంచి 134 కేసులు నమోదవ్వగా కేవలం జూన్‌లోనే మెడికల్ ఆఫీసర్లు 9 కేసులు గుర్తించారు. వైరల్ ఫీవర్, డయేరియా, టైఫాయిడ్ వ్యాధులు ప్రజలను కుదిపేస్తున్నాయి. సర్కారు ఆస్పత్రుల్లో జూన్ నుంచి డయేరియా 263,37, టైఫాయిడ్, 467 వైరల్ ఫీవర్ కేసులను గుర్తించి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. దీంతో అంగన్వాడీ, ఆశావర్కర్లను స్థానిక అధికారులను అలర్ట్ చేసింది.
Similar News
News March 7, 2026
నిజామాబాద్: ఇంట్లో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య..!

నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాకేశ్ (28) అనే యువకుడు శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడికి భార్య, 4 ఏళ్ల కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
News March 7, 2026
NZB: కుళాయి గుంతలో పడి వ్యక్తి మృతి

నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. నల్లోల్ల రవి (46) అనే వ్యక్తి తన ఇంటి ముందున్న కుళాయి గుంతలో ప్రమాదవశాత్తు పడి ప్రాణాలు కోల్పోయాడు. నిన్న ఉదయం ఈ ఘటన జరగ్గా, కాసేపటి తర్వాత గమనించిన సోదరుడు చూసేసరికి రవి మృతి చెందాడు. మృతుడి తల్లి సత్తమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News March 7, 2026
NZB: 14 ఏళ్ల బాలికలకు HPV టీకా ఇప్పించాలి: DMHO

14 ఏళ్ల బాలికలందరికీ HPV టీకా ఇప్పించాలని NZB DMHO రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 14 సంవత్సరాల బాలికలందరికీ సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV టీకాలు కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభిస్తారని ఆమె చెప్పారు. 7 మార్చి 2011 నుంచి 8 మార్చి 2012 మధ్యలో పుట్టిన అమ్మాయిలకు ఈ టీకా ఇప్పించాలన్నారు.


