News July 8, 2024
ప్రైవేటు మందుల దుకాణాల్లో యదేచ్చగా దోపిడీ

ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానంగా కొనసాగుతున్న కొన్ని మెడికల్ ఔషధ షాపుల్లో అధిక ధరలు వసూలు చేస్తూ రోగులను దోచుకుంటున్నారు. వీటిల్లో ఎక్కువ శాతం తక్కువ ధర ఉండే జనరిక్ మందులనే విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా డబ్బులు దండుకుంటున్న తనిఖీలు చేయాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 14, 2026
నల్గొండలో 40 డిగ్రీలు దాటిన ఎండలు

నల్గొండ జిల్లాలో వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. మార్చి రెండో వారంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.4 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడిచిన రెండు రోజులుగా ఎండ తీవ్రత గణనీయంగా పెరిగింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
News March 14, 2026
సామాన్యుడికి చికెన్ ‘షాక్’.. కిలో స్కిన్ లెస్ రూ.330

వేసవి ఎండల ప్రభావం, కోళ్ల ఉత్పత్తి తగ్గడం వల్ల జిల్లాలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అటు రంజాన్ మాసం, ఇటు ఎండల తీవ్రత పెరగడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గి ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ధరలు భారీగా పెరగడంతో నాన్‌వెజ్ ప్రియులు చికెన్ సెంటర్ల వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. NLG మార్కెట్‌లో లైవ్ కోడి KG రూ.192, డ్రెస్డ్ చికెన్ కిలో రూ.300, స్కిన్ లెస్ కిలో రూ.330లకు విక్రయిస్తున్నారు.
News March 14, 2026
NLG: తెల్లవారుజామున వాహనం ఢీకొని మహిళ మృతి

తిప్పర్తిలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో కేశరాజ్‌పల్లి గ్రామ సమీపంలో కాలినడకన వెళ్తుండగా వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


