News July 8, 2024
తిరుపతి: డిప్లొమా కోర్సులకు దరఖాస్తు

ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో అనిమల్ హస్బెండరీ (ఏహెచ్) పాలిటెక్నిక్ డిప్లొమా రెండేళ్ల కాలవ్యవధి గల కోర్సుకు ఆన్ లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ చెంగల్రాయులు ఒక ప్రకటనలో తెలిపారు. SSC లేదా తత్సమాన పరీక్ష పాసైన విద్యార్థులు సోమవారం నుంచి వర్సిటీ వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు గడువు ఈ నెల 27వ తేదీతో ముగుస్తుందని చెప్పారు.
Similar News
News January 15, 2026
చిత్తూరు జిల్లాలో రేపటి నుంచి ఈ-ఆఫీస్

చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి ఈ-ఆఫీస్ విధానం అమలు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 98 ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పాలనకు అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. పనులు వేగవంతంగా పారదర్శకంగా జరిగేలా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News January 14, 2026
టీచర్లకు చిత్తూరు DEO కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలో విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఎంఈవోలు, నాన్ టీచింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సిందేనని డీఈవో రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. ఈనెల 13న 286 మంది విద్యాశాఖ ఉద్యోగులు ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉందన్నారు. 189 మంది మాత్రమే నమోదు చేశారని.. మిగిలిన వారు వేయలేదని చెప్పారు. వేయని వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.
News January 14, 2026
CTR: భారీగా పడిపోయిన టమాటా ధరలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు క్రమంగా పడిపోతున్నాయి. పుంగనూరులో మొదటి రకం 10 కిలోల బాక్స్ బుధవారం గరిష్ఠంగా రూ.194, కనిష్ఠంగా రూ.140 పలికింది. పలమనేరులో గరిష్ఠ ధర రూ.220, కనిష్ఠ ధర రూ.170, వి.కోటలో గరిష్ఠ ధర రూ.200, కనిష్ఠ ధర రూ.140, ములకలచెరువులో గరిష్ఠ ధర రూ.230, కనిష్ఠ ధర రూ.120గా నమోదైంది.


