News July 8, 2024
పాల్వంచలో టిఫిన్ చేస్తుండగా గుండెపోటుతో మృతి

టిఫిన్ చేస్తున్న ఓ వ్యక్తికి గుండెపోటు రాగా
ఆస్పత్రికి తరలించే లోగా మృతి చెందాడు. పోలీసుల వివరాలిలా.. పాల్వంచలోని టీచర్స్ కాలనీకి చెందిన వెంకటలక్ష్మీనారాయణ ఆదివారం ఇంట్లో టిఫిన్ చేస్తూ ఒక్కసారిగా ఛాతీనొప్పితో కుప్పకూలాడు. అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై బి.రాము కేసు నమోదు చేశారు.
Similar News
News February 21, 2026
ఖమ్మం: బాలకృష్ణ, లోకేశ్‌తో మంత్రి తుమ్మల భేటీ

హైదరాబాదులో జరిగిన ఒక వివాహ వేడుకలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కాసేపు కుశలప్రశ్నలు వేసుకుని, వివిధ అంశాలపై ముచ్చటించారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఒకే వేదికపై కలిసిన ఈ దృశ్యం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
News February 21, 2026
హాల్‌టికెట్లలో తప్పులుంటే సంప్రదించండి: ఖమ్మం డీఐఈఓ

ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని డీఐఈఓ రవి బాబు తెలిపారు. హాల్‌టికెట్లలో ఏవైనా తప్పులుంటే వెంటనే కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ, విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు.
News February 21, 2026
ఖమ్మం: అడవిని తలపిస్తున్న క్రీడా ప్రాంగణాలు

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం లక్షలతో నిర్మించిన క్రీడా ప్రాంగణాలు జిల్లాలో నిరుపయోగంగా మారాయి. అధికారులు నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ వీటిని ఏర్పాటు చేయడంతో క్రీడాకారులు అడుగుపెట్టని పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో మైదానాలో చెట్లు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిని వినియోగంలోకి తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు.


