News July 8, 2024
HYD: నేడు వనమహోత్సవం ప్రారంభం
హైదరాబాద్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నేడు వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ఉప్పల్ సర్కిల్-2, హబ్సిగూడ సర్కిల్- 8, రామంతాపూర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
Similar News
News December 21, 2024
HYD: శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ చికిత్సకు స్పందిస్తున్నాడు. వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉండగా.. అప్పుడప్పుడు జ్వరం వస్తోంది. నాడీ వ్యవస్థ ప్రస్తుతానికి స్థిరంగా పనిచేస్తుందని.. నిన్నటి కంటే ఈరోజు శ్రీతేజ ఆరోగ్యం మెరుగైందని శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
News December 21, 2024
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వీడ్కోలు
శీతాకాల విడిది కోసం మంగళవారం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శనివారం హకీంపేట్ విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, మేడ్చల్ జిల్లా కలెక్టరు గౌతమ్ తదితరులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘనంగా వీడ్కోలు పలికారు.
News December 21, 2024
రాష్ట్రపతి నిలయం సందర్శనకు వారికి స్పెషల్ ఎంట్రీ
రాష్ట్రపతి నిలయం సందర్శనకు వసతి గృహాల విద్యార్థులకు ప్రత్యేక ప్రవేశం కల్పించనున్నారు. పిక్నిక్ స్పాట్లా ఉండేలా పిల్లలకు ప్లే ఏరియా, ఉద్యాన ఉత్సవాన్ని తిలకించేందుకు వసతి గృహాల విద్యార్థులను రాష్ట్రపతి నిలయానికి తీసుకువచ్చి ఆహ్లాదకర వాతావరణంలో జ్ఞాపకాలు గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన తాగునీరు, అంబులెన్స్, మొబైల్ టాయిలెట్లు, రవాణా, లైటింగ్ వంటి మౌళిక వసతులు కల్పిస్తున్నారు.