News July 8, 2024

విజయవాడ: ఆర్‌ఐని సస్పెండ్ చేసిన సీపీ

image

పోలీసు సిబ్బందిపై అనుచితంగా వ్యవహరిస్తున్న ఆర్‌ఐ శ్రీనివాసరావును విజయవాడ కమిషనర్ రామకృష్ణ ఆదివారం సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా సిటీ సెక్యూరిటీ వింగ్‌లో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు తన క్రింది మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై విచారించి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని చెప్పారు.

Similar News

News March 27, 2026

కృష్ణా: ఖరీఫ్ ధాన్యం సేకరణపై కలెక్టర్ సమీక్ష

image

ధాన్యం కొనుగోళ్లలో రైతుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
గురువారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖాధికారులతో సమావేశమైన కలెక్టర్ ధాన్యం సేకరణపై సమీక్షించారు. జిల్లాలో 54,678 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ధాన్యం సేకరణకు అవసరమైన కేంద్రాల ఏర్పాటు, సాంకేతిక సిబ్బంది నియామకంతో పాటు వారికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు.

News March 26, 2026

కృష్ణా: ‘అన్ని ప్రభుత్వ సంస్థల్లో స్వచ్ఛ ఆంధ్ర నిర్వహించాలి’

image

నాల్గో శనివారం సందర్భంగా ఈ నెల 28న జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, అపార్ట్‌మెంట్లలో స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం మచిలీపట్నంలోని తన చాంబర్ నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఒక్కరు పరిశరాల శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.