News July 8, 2024

ఉచిత ఇసుక విధానం ప్రారంభం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. కొన్ని జిల్లాల్లో స్టాక్ పాయింట్ల వద్ద మంత్రులు ఇసుక సరఫరాను ప్రారంభించారు. ప్రస్తుతం వేర్వేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. దీనిపై మార్గదర్శకాలను పేర్కొంటూ ఈరోజు అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Similar News

News April 10, 2026

ఈ నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ

image

AP: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 2026-27 ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్నుపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. అలాగే 2025-26 వరకు ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ సదుపాయాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

News April 10, 2026

రైతు భరోసా రెండో విడతపై అప్‌డేట్

image

TG: రైతు భరోసా రెండో విడత సాయాన్ని ఈ నెల 22లోపు అందించేందుకు ప్రభుత్వం నిధులు సిద్ధం చేస్తోంది. ఈ విడతలో 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నగదు జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే మూడో విడత సాయాన్ని ఈ నెలాఖరులోగా జమ చేయొచ్చని తెలుస్తోంది. కాగా గత నెల 23న తొలి విడత కింద ఒక ఎకరం భూమి వరకు రూ.6,000 చొప్పున సాయం అందించిన విషయం తెలిసిందే.

News April 10, 2026

మే 22/23న ‘స్వయంభు’ రిలీజ్?

image

భరత్ కృష్ణమాచారి డైరెక్షన్‌లో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘స్వయంభు’ సీజీ వర్క్స్ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మే 15 నాటికి వాటిని పూర్తి చేసి 22 లేదా 23వ తేదీల్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సంయుక్తా మేనన్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెలలోనే మూవీని రిలీజ్ చేయాల్సి ఉండగా గ్రాఫిక్స్ పనుల కారణంగా ఆలస్యమవుతోంది.