News July 8, 2024
కూటమిలో ఉన్నా ప్రజాసమస్యలు లేవనెత్తుతాం: పురందీశ్వరి

AP: కూటమిలో ఉన్నా ప్రజాసమస్యలను లేవనెత్తుతామని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందీశ్వరి అన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. మరోవైపు NDA పదేళ్ల పాలనలో దేశంలో అద్భుత ప్రగతి ఉందన్నారు. వికసిత్ భారత్, ఆత్మనిర్బర్ భారత్‌కు ప్రజలు ఓటేశారని పేర్కొన్నారు.
Similar News
News September 16, 2025
మైథాలజీ క్విజ్ – 7

1. మహావిష్ణువు ద్వారపాలకులెవరు?
2. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది?
3. భీష్ముడి అసలు పేరేంటి?
4. గంగోత్రి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. భాద్రపద మాసంలో చవితి రోజున వచ్చే పండుగ ఏది?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. పై ప్రశ్నలకు జవాబులను మైథాలజీ క్విజ్ – 8 (రేపు 7AM)లో పబ్లిష్ చేస్తాం.
<<17697694>>మైథాలజీ క్విజ్-6 <<>>జవాబులు: 1.18 వేలు 2.దండకారణ్యం 3.మధుర 4.గుజరాత్ 5.రాఖీ
News September 16, 2025
రూ.2 లక్షల వరకు ధరలు తగ్గింపు

ప్రీ GST, పండుగ డిస్కౌంట్ కింద కార్ల కంపెనీ కియా ఇండియా తెలుగు రాష్ట్రాల ప్రజలకు రూ.2 లక్షల వరకు ఆఫర్ ప్రకటించింది. సెల్టోస్ మోడల్‌పై రూ.2 లక్షలు, కారెన్స్ క్లావిస్‌పై రూ.1.33 లక్షలు, కారెన్స్‌పై రూ.1.02 లక్షల తగ్గింపు పొందవచ్చని పేర్కొంది. సెప్టెంబర్ 22 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఆఫర్ ఉందని, అయితే ధరల్లో మార్పు ఉంటుందని వెల్లడించింది.
News September 16, 2025
ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

TG: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(TANHA) ప్రకటించింది. 323 ఆసుపత్రులకు ₹1,400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని చెప్పింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామంది. మరోవైపు ఇటీవల ఇచ్చిన హామీ మేరకు ₹100 కోట్లు విడుదల చేశామని వైద్య వర్గాలు తెలిపాయి.