News July 8, 2024
చంద్రబాబును విమర్శిస్తే వదిలిపెట్టం: సోమిరెడ్డి

AP: తెలుగు రాష్ట్రాల గత CMలు జగన్, కేసీఆర్.. ప్యాలెస్, ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైరయ్యారు. ఇప్పటి CMలు చంద్రబాబు, రేవంత్ ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సమావేశమయ్యారని తెలిపారు. వీరి భేటీపై మాజీ మంత్రి కాకాణి విమర్శలు సరికాదన్నారు. ఇంకోసారి CBNను విమర్శిస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. జగన్ నియంతలా వ్యవహరించారని, ఆయన పాలన కర్ఫ్యూను తలపించిందని దుయ్యబట్టారు.
Similar News
News January 13, 2026
రూపాయి క్షీణత.. హెచ్చుతగ్గుల్లో భాగమే: RBI గవర్నర్

ఇటీవల రూపాయి <<18834841>>విలువ<<>> పడిపోతుండటం తెలిసిందే. డాలర్‌తో పోలిస్తే రూపీ వాల్యూ రూ.90ని దాటింది. అయితే ఇది సాధారణ హెచ్చుతగ్గుల్లో భాగమేనని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ‘రూపాయి, మారకపు రేట్లపై RBI విధానం ఏళ్లుగా స్థిరంగా ఉంది. మార్కెట్లు బలంగా ఉన్నాయని మేం నమ్ముతున్నాం. ధరలను అవే నిర్ణయిస్తాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత ఎకానమీ మూలాలు బలంగా ఉన్నాయని తెలిపారు.
News January 13, 2026
చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలడంతో కన్ను కోల్పోయిన చిన్నారి!

చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలడంతో ఓ చిన్నారి చూపు కోల్పోయాడు. ఒడిశాలోని టిట్లాగఢ్‌లో అంకేశ్(8) చిప్స్ ప్యాకెట్‌లో వచ్చిన టాయ్‌తో ఆడుకుంటూ వంటింట్లోకి వెళ్లాడు. ఆ బొమ్మ స్టవ్‌పై పడి పేలిపోయింది. దీంతో అతడి కంటికి తీవ్ర గాయమై చూపు కోల్పోయాడు. గతనెలలో కంధమల్(D)లో చిప్స్ ప్యాకెట్‌లోని టాయ్ మింగి 4 ఏళ్ల చిన్నారి చనిపోయాడు. ఇలాంటి టాయ్స్ విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News January 13, 2026
IT కంపెనీల లాభాలకు గండి.. కారణమిదే

కొత్త లేబర్ కోడ్‌ల వల్ల IT కంపెనీల లాభాలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా వేతనంలో బేసిక్ పే 50% ఉండాలనే నిబంధన.. దీనివల్ల PF, గ్రాట్యుటీ ఖర్చులు పెరగడం సంస్థలకు భారంగా మారింది. అలాగే ఏడాదికే గ్రాట్యుటీ చెల్లింపు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కోసం కంపెనీలు భారీగా నిధులను కేటాయించాల్సి వచ్చింది. ఈ అదనపు వ్యయాలే TCS, HCL వంటి కంపెనీల నికర లాభాలను తగ్గించాయి. అయితే ఇది ఈ క్వార్టర్‌కే పరిమితమని నిపుణులు తెలిపారు.


