News July 8, 2024
జగిత్యాల ప్రజావాణిలో 58 ఫిర్యాదులు

జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 58 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పి.రాంబాబు, రఘువరన్ ఆర్డీవోలు మధుసూదన్, ఆనంద్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 19, 2026
KNR: ‘పీఎం శ్రీ’ పెండింగ్ బిల్లులపై సమీక్ష

జిల్లాలో పీఎం శ్రీ కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలల్లో పెండింగ్ బిల్లుల అంశంపై విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ట్రెజరీ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడితో కలిసి సమీక్షించారు. వేతన బిల్లులు మినహా అన్నిరకాల చెల్లింపులు వెనువెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ పాఠశాలల్లో వాననీటి సంరక్షణ గుంతల నిర్మాణాన్ని వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు.
News February 19, 2026
రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు కరీంనగర్ క్రీడాకారుల పయనం

రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో సత్తా చాటేందుకు కరీంనగర్ జిల్లా క్రీడాకారులు ఉత్సాహంగా బయలుదేరారు. ఈ నెల 15 నుంచి 20 వరకు కరీంనగర్ జిల్లాల్లో నిర్వహించే 43 క్రీడాంశాల్లో వీరు తలపడనున్నారు. క్రీడాకారులు తమ ప్రతిభతో జిల్లాకు పేరు తీసుకురావాలని జిల్లా యువజన, క్రీడా అధికారి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు.
News February 19, 2026
KNR: ‘10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థుల సన్నద్ధతపై మండల విద్యాధికారులు, ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న నెల రోజులు పదో తరగతి విద్యార్థులకు చాలా కీలకమని అన్నారు. అందువల్ల ప్రతి వారం ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన పాఠశాలలను విధిగా సందర్శించి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.


