News July 8, 2024
శ్రీలంక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య

శ్రీలంక క్రికెట్ టీమ్‌కు తాత్కాలిక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య నియమితులయ్యారు. ఇప్పటినుంచి సెప్టెంబర్‌లో ఇంగ్లండ్ పర్యటన వరకూ ఆయన కోచ్‌గా కొనసాగుతారని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటివరకు ఆయన ఆ జట్టుకు ఫుల్ టైమ్ క్రికెట్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. శ్రీలంకకు 445 ODI, 110 టెస్టులు, 31 T20ల్లో ప్రాతినిధ్యం వహించిన ఆయన మొత్తం 21,032 రన్స్ చేశారు. ఇందులో 42 సెంచరీలున్నాయి.
Similar News
News October 23, 2025
మహిళా శక్తి.. ప్రశంసించాల్సిందే!

నేటి సమాజంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కుటుంబం సజావుగా నడుస్తోంది. ఈ క్రమంలో ఇంటి పని, ఆఫీస్ ఒత్తిడి, కుటుంబాన్ని చక్కదిద్దే బహుముఖ పాత్రను పోషిస్తున్న మహిళల కృషి అసాధారణమైనది. ఆఫీసు పనితో పాటు ఇంటి బాధ్యతలు, పిల్లల ఆలనా పాలన చూసుకోవడం అంత తేలిక కాదు. ఈ సవాళ్లు అలసట కలిగించినా, తన ప్రేమ, బలం, దృఢ సంకల్పంతో ఆమె అన్నిటినీ సమన్వయం చేస్తోంది. నిజంగా, మహిళే ఆ కుటుంబానికి గుండెకాయ!
News October 23, 2025
₹6500 కోట్లతో పల్లె పండుగ 2.0

AP: గ్రామాల రూపురేఖలు మార్చేలా పల్లె పండుగ-2.0కు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దీనికోసం ₹6500 కోట్లతో 52వేల పనులు చేపట్టి సంక్రాంతికి పూర్తి చేసేలా ప్లాన్ రూపొందిస్తోంది. ఈనెలాఖరు లేదా నవంబర్ తొలివారంలో ప్రారంభిస్తారని తెలుస్తోంది. గతేడాది ఇదే ప్రోగ్రాం కింద ₹4500 కోట్లు ఖర్చు చేశారు. ఈసారి కూడా గతంలో మాదిరి రోడ్లు, కాలువలు, గోకులాలతో పాటు 1107 పంచాయతీల్లో మ్యాజిక్ డ్రెయిన్ ఇతర పనులు చేపట్టనున్నారు.
News October 23, 2025
వేధింపులను ధైర్యంగా ఎదుర్కోండి

చాలామంది మహిళలు భర్త, అత్తవారింటి నుంచి వేధింపులు ఎదురైనపుడు కుటుంబ పరువు గురించి ఆలోచించి వాటిని భరిస్తూ కుంగిపోతున్నారు. కొందరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. మహిళలను వెంబడించినా, దూషించినా, అడ్డుకున్నా, వేధింపులకు గురి చేసినా.. ఐపీసీ పలు సెక్షన్ల కింద శిక్షార్హులని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి వాటిపై మహిళలు అవగాహన పెంచుకోవాలని, అందుబాటులో ఉన్న సౌకర్యాలు వాడుకోవాలని సూచిస్తున్నారు.