News July 8, 2024
10న చిత్తూరులో మెగా జాబ్ మేళా

చిత్తూరు పట్టణంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో 10న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మజ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు. టెన్త్, ఇంటర్, డిప్లమా, ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని చెప్పారు. అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News March 1, 2026
చిత్తూరు: HPV వ్యాక్సిన్‌పై అవగాహన

సర్వైకల్ క్యాన్సర్ వ్యాపించకుండా 14 ఏళ్లలోపు బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న సర్వేలో 4185 మంది క్యాన్సర్ అనుమానితులను గుర్తించారు. ఈ వ్యాక్సిన్ 18,500 మంది బాలికలకు అందించాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు.
News March 1, 2026
చిత్తూరు: చెత్త ఇస్తే డబ్బులు.. ఎంతో తెలుసా.?

పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛ రథాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం నెలలో ఒకరోజు పంచాయతీల పరిధిలో ఈ వాహనం పర్యటిస్తుందని అధికారులు తెలుపుతున్నారు. వాహనాలకు అందజేస్తే పాత ఇనుముకు కేజీ రూ. 20, అల్యూమినియం రూ. 120, స్టీల్ రూ.40, పేపర్లు రూ.15, పుస్తకాలు, అట్టపెట్టెలు రూ.10, ప్లాస్టిక్ రూ.20 చొప్పున చెల్లిస్తారని పేర్కొంటున్నారు.
News March 1, 2026
చిత్తూరు జిల్లాలో 93% పింఛన్ల పంపిణీ

జిల్లాలో శనివారం 93.10 శాతం మేర ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. 2,33,419 మందికి గాను తొలి రోజున 2,17,324 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు అందజేశామన్నారు. మార్చి ఒకటిన ఆదివారం సెలవు కావడం తో, 2న సోమవారం మిగిలిన 16,095 మందికి పింఛన్లు అందించనున్నట్లు పీడీ పేర్కొన్నారు.


