News July 8, 2024

పెళ్లి చేసుకోబోతున్నా.. అమ్మాయి సినీ రంగ వ్యక్తి కాదు: కుల్దీప్

image

త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు టీమ్ ఇండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ వెల్లడించారు. తనను, కుటుంబాన్ని బాగా చూసుకునే అమ్మాయి తన జీవితంలోకి రావడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొంతకాలంగా తాను బాలీవుడ్ నటితో స్నేహం చేస్తున్నట్లు వస్తున్న రూమర్స్‌ను ఖండించారు. తాను పెళ్లి చేసుకునే యువతి సినీ రంగానికి చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేశారు.

Similar News

News October 15, 2024

గురుకులాలను శాశ్వతంగా మూసివేసేందుకు కుట్ర?: KTR

image

TG: రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే గురుకులాలను శాశ్వతంగా మూసివేసే కుట్ర జరుగుతున్నట్లు అనిపిస్తోందని KTR అన్నారు. అద్దె చెల్లించకపోవడంతో గురుకులాలకు యజమానులు తాళాలు వేయడంపై ఆయన Xలో స్పందించారు. ‘ఢిల్లీకి మూటలు పంపేందుకు డబ్బులున్నాయి. కమిషన్లు వచ్చే బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు రూ.వేల కోట్లు ఉన్నాయి. కానీ గురుకులాల అద్దెలు చెల్లించడానికి డబ్బులు లేవా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

News October 15, 2024

పన్నూన్ హత్యకు కుట్ర: US వెళ్లిన భారత ఇన్వెస్టిగేషన్ టీమ్

image

ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై హత్యాయత్నం కేసులో భారత అధికారి జోక్యాన్ని దర్యాప్తు చేసేందుకు భారత బృందం అమెరికాకు వెళ్లింది. ప్రధాన నిందితుడు నిఖిల్ గుప్తాతో పాటు ఆ అధికారి ఇతర సంబంధాలను పరిశీలించనుంది. ఈ మేరకు భారత్ తమకు సమాచారం ఇచ్చిందని US స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. న్యూయార్క్‌లో పన్నూన్ హత్యకు వీరిద్దరూ కుట్ర పన్నారని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

News October 15, 2024

BREAKING: ఎన్నికల్లో ఫ్రీబీస్.. కేంద్రం, ECIకి సుప్రీం కోర్టు నోటీసులు

image

ఎలక్షన్ల ముంగిట రాజకీయ పార్టీలిచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణిస్తూ ఆదేశాలివ్వాలన్న పిల్‌పై ముందడుగు పడింది. కేంద్రం, ECIకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇదే అంశంపై నమోదైన పెండింగ్ కేసులనూ ఈ పిటిషన్‌కు ట్యాగ్ చేసింది. రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా వెంటనే పటిష్ఠ చర్యలు తీసుకొనేలా ECIకి ఆదేశాలివ్వాలని పిటిషన్‌దారులు సుప్రీం కోర్టును కోరారు. విచారణపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.