News July 9, 2024

విశాఖ: గిరిప్రదక్షిణపై కలెక్టర్ సమీక్ష సమావేశం

image

ఈనెల 20వ తేదీన జరగనున్న సింహాచలం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వివిధ శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప, జాయింట్ కలెక్టర్ కే.మయూర్ అశోక్, ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

Similar News

News September 30, 2024

AU: అక్టోబర్ 1న బి.ఆర్క్ స్పెషల్ ఎగ్జామినేషన్

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అయిదవ సంవత్సరం రెండవ సెమిస్టర్ స్పెషల్ ఎగ్జామినేషన్ అక్టోబర్ 1వ తేదీన నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్టర్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందన్నారు. 2019- 20 నుంచి ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని వివరించారు.

News September 30, 2024

హుకుంపేట: ‘2 రోజులు మా గ్రామానికి రావొద్దు’

image

హుకుంపేట మండలంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో మండలంలోని దాలిగుమ్మడి గ్రామస్థులు ముందు జాగ్రత్త చర్యలకు దిగారు. సోమ, మంగళవారం బయటి వ్యక్తులెవరూ గ్రామంలోకి రావొద్దని బారికేడ్ ఏర్పాటు చేశారు. గ్రామానికి వైరల్ జ్వరాలు, ఇతర జబ్బులు రాకుండా ఉండేందుకు  అ 2రోజులు పాటు అమ్మోరు పండుగ జరుపుకుంటామని వారు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి బయటి వ్యక్తులను అనుమతిస్తామన్నారు.

News September 30, 2024

విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు

image

వాల్తేరు డివిజన్ నుంచి దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. విశాఖ నుంచి తిరుపతి, బెంగళూరు, సికింద్రాబాద్, చెన్నై, అరకు, కొల్లాం తదితర ప్రాంతాలకు సుమారు 30 రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఇప్పటికే ఉన్న పలు రైళ్లకు స్లీపర్, జనరల్ బోగీలను కలపనున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వీటిని ఏర్పాటు చేశామని, వినియోగించుకోవాలని అధికారులు కోరారు.