News July 9, 2024
భారత ప్రజలకోసం మోదీ జీవితాన్ని అంకితం చేశారు: పుతిన్

రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీపై ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. మోదీ తన జీవితాన్ని భారత ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. చరిత్రాత్మక స్థాయిలో 3వసారి గెలుపొందారంటూ అభినందనలు తెలిపారు. పీఎం 2 రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. ఆయనకు నోవో-ఒగరెవోలోని తన నివాసంలో పుతిన్ సాయంకాల విందు ఏర్పాటు చేయడం విశేషం.
Similar News
News February 5, 2026
$400bn మార్కును దాటిన గూగుల్ రెవెన్యూ: సుందర్ పిచాయ్

గూగుల్ యాన్యువల్ రెవెన్యూ తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసిందని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. FY25 Q4 ఫలితాలను ఆయన వెల్లడించారు. 2025లో యూట్యూబ్ రెవెన్యూ 60 బిలియన్ డాలర్లను దాటినట్లు పేర్కొన్నారు. జెమినీ యాప్ మంత్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 750M+గా ఉన్నట్లు చెప్పారు. AI స్టాక్, జెమినీ 3 అడాప్షన్ తమ కంపెనీ ప్రోగ్రెస్‌కి ఫ్యూయల్‌లా పనిచేస్తున్నాయని వివరించారు.
News February 5, 2026
ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

<
News February 5, 2026
ఉదయం లేవగానే ఇది కనిపించిందా?

శాస్త్రాల ప్రకారం ఉదయం నిద్రలేవగానే బల్లిని చూడటం అదృష్టం. ఇది మీ దురదృష్టం తొలగి, విజయం వరించడాన్ని సూచిస్తుంది. బల్లి గోడపైకి పాకుతూ కనిపిస్తే పదోన్నతికి, ఆర్థిక లాభానికి సంకేతం. జ్యోతిషశాస్త్రం ప్రకారం బల్లి తలపై పడితే సమాజంలో గౌరవం పెరుగుతుందని, భుజంపై పడితే పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుందని నమ్మకం. ఈ శుభ శకునాలు మీ జీవితంలో సానుకూల మార్పులను, సిరిసంపదలను తీసుకువస్తాయి.


