News July 9, 2024
కొత్త పింఛన్లకు అర్హుల జాబితాను సిద్ధం చేయండి: మంత్రి సీతక్క
TG: రాష్ట్రంలో కొత్త పింఛన్ల జారీకి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. BRS ప్రభుత్వ హయాంలో పెండింగులో ఉన్నవి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో సూచించారు. చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని తెలిపారు. గత ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని, ఆ వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు.
Similar News
News January 19, 2025
నేడు దావోస్ పర్యటనకు చంద్రబాబు
AP: వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎంతో పాటు అధికారుల బృందం సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్లి అక్కడనుంచి జ్యూరిచ్ వెళ్లనుంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ కానున్నారు. ఈ పర్యటనలో జరిపే చర్చలు, చేసుకునే ఒప్పందాలకు ప్రచారం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.76 కోట్లు రిలీజ్ చేసింది.
News January 19, 2025
అత్యధిక వికెట్లు.. కానీ CTలో నో ఛాన్స్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మహమ్మద్ సిరాజ్ లేకపోవడంపై కొందరు క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2022 నుంచి వన్డేల్లో ఎక్కువ వికెట్లు (71) తీసిన భారత బౌలర్ అతడేనని గుర్తు చేస్తున్నారు. అయితే సిరాజ్‌కు న్యూ బాల్‌తో బౌలింగ్ వేసే ఛాన్స్ రాకపోతే అంత ప్రభావవంతంగా కనిపించడని కెప్టెన్ రోహిత్ శర్మ నిన్న చెప్పారు. అర్ష్‌దీప్ సింగ్ కొత్త, పాత బంతితో బౌలింగ్ వేయగలడని తెలిపారు. దీనిపై మీ కామెంట్?
News January 19, 2025
మహిళల ఖాతాల్లోకి రూ.12వేలు
TG: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12వేల ఆర్థిక చేయూత నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదని చెప్పారు. ఉపాధి హామీ కూలీల ఆధార్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదని, డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నెల 26న తొలి విడతగా అకౌంట్లలో రూ.6వేలు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.