News July 9, 2024

విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ప్రారంభం

image

విశాఖ తూర్పు నావికాదళంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ప్రారంభమైంది. సోమవారం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంథార్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొని హబ్‌ను ప్రారంభించి రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సముద్ర యానం, మారిటైం భద్రత వంటి అంశాలకు సంబంధించిన సాంకేతిక పరి జ్ఞానాన్ని సకాలంలో అందుబాటులోకి తెచ్చేందుకు ఎ.ఐ. హబ్ ఉపయోగపడుతుందన్నారు.

Similar News

News February 27, 2026

విశాఖ: లారీ డ్రైవర్ ఆత్మహత్య

image

తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్, గాజువాక బెల్ కంపెనీ ఎదురుగా ఉన్న మైదానంలోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లారీ‌తో కంపెనీకి వచ్చిన విజ్జి అనే డ్రైవర్ అడ్మిన్ బిల్డింగ్ ఎదురుగా మైదానంలో లారీ ఆపి శుక్రవారం ఉదయం లారీ క్యాబిన్ తలుపుకి తాడు కట్టి ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News February 27, 2026

మాంసం వ్యర్థాల మాయాజాలం.. కాంట్రాక్టర్లకు జీవీఎంసీ చెక్

image

మాంసం వ్యర్థాల ద్వారా GVMCకు వచ్చే ఆదాయం కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్న వ్యవహారంపై అధికారులు దృష్టి సారించారు. రోజుకు 10-15 టన్నులు, ఆదివారం 30 టన్నుల వరకు వ్యర్థాల సేకరణ జరుగుతున్నట్టు నెల రోజుల సర్వేలో తేలింది. ఇవి కాపులుప్పాడకు తరలించాల్సి ఉండగా గోదావరి జిల్లాల చేపల చెరువులకు మళ్లుతున్నట్లు గుర్తించారు. ఇకపై వీటిని కాపులుప్పాడ డంపింగ్ యార్డులోనే టెండర్ ద్వారా విక్రయించాలని నిర్ణయించారు.

News February 27, 2026

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: విశాఖ సీపీ

image

మాదకద్రవ్యాలకు బానిసవ్వడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, భవిష్యత్తు, అవకాశాలు కోల్పోతారని సీపీ శంఖబ్రత బాగ్చి యువతను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖలో గురువారం జరిగిన కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ తమ భవిష్యత్తును కాపాడుకునేలా సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.. ప్రతీ విద్యార్థి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వారియర్స్‌గా మారాలన్నారు.