News July 9, 2024
నెల్లూరు: బస్సు డ్రైవర్‌కి మూర్ఛ.. ఐదు కార్లను ఢీకొన్న స్కూల్ బస్సు

నెల్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి నుంచి మినీ బైపాస్‌కు ఫ్లైఓవర్ మీదుగా ఓ పాఠశాల బస్సు వెళ్తోంది. ఫ్లైఓవర్ దిగగానే బస్సు డ్రైవరుకు మూర్ఛ వచ్చింది. ఈక్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన ఐదు కార్లను వెనువెంటనే ఢీకొంది. బస్సులో ఉన్న ఓ మహిళ కిందపడిపోయారు. స్థానికులు డ్రైవరును ఆసుపత్రికి తరలించారు. దెబ్బతిన్న కార్లలోనూ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
Similar News
News January 22, 2026
నెల్లూరు మీదుగా మరో ప్రతిష్ఠాత్మక రైలు.!

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా హైదరాబాద్ (చర్లపల్లి)-తిరువనంతపురం నార్త్ మధ్య కొత్త అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టబోతోంది. ఈ రైలు నెల్లూరు మీదుగా వెళ్లనుంది. నెల్లూరుకు ఉదయం 5:43కు రానున్న ఈ రైలు 5.45AMకు బయలుదేరి 4:30 PMకు చర్లపల్లి చేరుకోనుంది. ఉదయాన్నే నెల్లూరు నుంచి HYD వెళ్లాలనుకునే వారికి ఈ రైలు ఉపయోగపడనుంది.
News January 22, 2026
ఉదయగిరి: కెమెరాకు చిక్కిన పెద్దపులి.?

ఉదయగిరి-బండగానిపల్లి ఘాట్ రోడ్డులో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పెద్దపులి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలోని ఓ కెమెరాకు చిక్కినట్లు సమాచారం. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం దీనిని అధికారికంగా నిర్ధారించలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసినట్లు సమాచారం. కొండ కింద గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు ఘాట్ రోడ్డులో రాకపోకలు సాగించే వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు.
News January 22, 2026
నెల్లూరు: ఆగని తల్లుల కడుపు‘కోత’.!

జిల్లాలో సిజేరియన్ ప్రసవాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉన్నా డబ్బుల కక్కుర్తితో డాక్టర్లు కత్తికి పనిచెబుతున్నారు. జిల్లాలో ఏటా 10 వేల వరకు ప్రసవాలు జరుగుతుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 30 వేల వరకు ఉంది. 2024-25 మధ్య దాదాపు 11 వేల వరకు సిజేరియన్‌లు జరిగాయట. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సరైన నిఘా లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందట. దీనిపై DMHO సుజాత సైతం ఆందోళన వ్యక్తం చేశారు.


