News July 9, 2024
ఇంజనీరింగ్‌లో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు సీట్లు

కొత్తగూడెం సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, కార్మికుల పిల్లలకు జేఎన్టీయూ పరిధిలోని మంథని, కొత్తగూడెంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయించారు. ప్రవేశలకు గత నెల 30 వరకు ఉన్న దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. దరఖాస్తులను 23వ తేదీలోగా కార్పొరేట్ కార్యాలయానికి పంపించాలని అధికారులు సూచించారు.
Similar News
News January 18, 2026
ఖమ్మం: పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

ఈనెల 23, 24, 25న ఖమ్మంలో జరిగే PDSU రాష్ట్ర 23వ మహాసభల విజయవంతానికై రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు భారీగా తరలిరావాలని రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ విజ్ఞప్తి చేశారు. శనివారం ఖమ్మం రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలకు అప్పగించి విద్యావ్యవస్థను పూర్తిగా వ్యాపారమయం చేశారని విమర్శించారు.
News January 17, 2026
తెలంగాణ మోడల్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానం

ఖమ్మం జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6వ తరగతితో పాటు, 7-10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ చైతన్య జైనీ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు.
News January 17, 2026
ఖమ్మం: నగారా మోగకముందే.. ‘సర్వే’ సందడి!

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఎన్నికల నగారా మోగకముందే పలు సర్వే సంస్థలు రంగప్రవేశం చేసి ఆశావాహులను చుట్టుముడుతున్నాయి. ‘ఓటర్ల నాడి మాకు తెలుసు’ అంటూ నమ్మబలుకుతున్నాయి. పార్టీ టికెట్ల వేటలో ఉన్న అభ్యర్థులకు ఈనివేదికలు ఆయుధాలుగా మారుతాయని ఆశ చూపుతున్నాయి. మరోవైపు జిల్లా యంత్రాంగం వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల కసరత్తును వేగవంతం చేయడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.


