News July 9, 2024

రన్‌వే విస్తరణకు ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్

image

ఓర్వకల్లు విమానాశ్రయంలో రన్‌వే విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా విమానాశ్రయ అధికారులను ఆదేశించారు. సోమవారం ఓర్వకల్లు ఎయిర్ పోర్టు డెవలప్‌మెంటు అధికారులతో సమీక్షించారు. రన్‌వే విస్తరణకు కావాల్సిన నిధులు, తదితర వివరాలతో పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. విమానాలు రాత్రి సమయంలో దిగేందుకు అనువైన చర్యలు చేపట్టాలన్నారు.

Similar News

News January 21, 2026

కర్నూలు: ఊ అంటుందా. ఊఊ అంటుందా?

image

ఆదోని జిల్లా కోసం పట్టణంలో భారీగా నిరసనలు, నిరాహార దీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలైన పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరులో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో ఈనెల 24న ఆ 5 నియోజకవర్గాల్లో బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. ఈ బంద్ తర్వాతైనా ప్రభుత్వం ప్రత్యేక జిల్లాకు ఊ కొడుతుందా లేక ఊఊ అంటుందా చూడాలి.

News January 21, 2026

కర్నూలు: ఎయిడెడ్ పోస్టుల భర్తీకి పరీక్షా షెడ్యూల్ విడుదల

image

కర్నూలు జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి డీఈవో సుధాకర్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దుపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల్లో ఈనెల 27 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News January 21, 2026

ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలోని రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పంటలో రైతులకు అధిక దిగుబడి, లాభాలు వచ్చేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.ఈ సమావేశంలో అగ్రికల్చర్ ఆఫీసర్ వరలక్ష్మి పాల్గొన్నారు.