News July 9, 2024

తలొగ్గని రేవంత్ సర్కారు.. నెక్స్ట్ ఏంటి?

image

TG: డీఎస్సీ పరీక్షల తేదీ మార్పు విషయంలో అభ్యర్థుల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గలేదు. పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు రోడ్డెక్కారు. అయితే షెడ్యూల్ ప్రకారమే జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేస్తుంటే.. 25వేలకు పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రిపరేషన్ కోసం సమయం కావాలంటున్నారు.

Similar News

News January 18, 2025

సైఫ్‌పై దాడి.. ఈ ప్రశ్నలకు సమాధానమేది?

image

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి ఘటనలో పలు విషయాలు అంతుచిక్కడం లేదు. *ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి దాడి తర్వాత ఎలా తప్పించుకున్నాడు? *బిల్డింగ్‌ లేఅవుట్ అతనికి ముందే తెలుసా? *సైఫ్ ఆటోలోనే ఎందుకు వెళ్లారు? *సైఫ్‌తో పెద్ద వారు కాకుండా 7 ఏళ్ల చిన్నారి ఎందుకు వెళ్లాడు? వంటి ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. నిందితుడు పోలీసులకు చిక్కితే వీటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

News January 18, 2025

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు జారీ

image

AP: ఏప్రిల్‌కు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఇవాళ ఉ.10గంటలకు రిలీజ్ చేయనుంది. ఈ సేవల లక్కీడిప్ కోసం ఈ నెల 20న ఉ.10గంటల వరకు నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ నెల 23న ఉ.10 గంటలకు అంగప్రదక్షిణం, ఉ.11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా, మ.3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లు జారీ చేయనుంది. 24న ఉ.10 గంటలకు రూ.300 కోటా, మ.3 గంటలకు వసతి గృహ టికెట్లు ఇవ్వనుంది.

News January 18, 2025

బీజేపీ మ్యానిఫెస్టోలోనూ మా పథకాలే: కేజ్రీవాల్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రకటించిన మ్యానిఫెస్టోపై ఆప్ చీఫ్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆప్ పథకాలపై విమర్శలు చేస్తూనే BJP చీఫ్ నడ్డా ఉచితాలను ప్రకటించారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఉచితాలు హానికరం కాదని చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ గతంలో తమపై చేసిన వ్యాఖ్యలు తప్పని ఒప్పుకోవాలన్నారు. తాము అమలు చేస్తున్న పథకాలనే బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రకటించిందని విమర్శించారు.