News July 9, 2024

విషాదం.. USలో తూ.గో జిల్లా యువకుడి మృతి

image

తూ.గో జిల్లా గోపాలపురం మండలంలో విషాదం నెలకొంది. చిట్యాలకు చెందిన యువకుడు అమెరికాలో వాటర్ ఫాల్స్‌లో పడి మృతి చెందాడు. శ్రీనివాస్-శిరీష దంపతుల కుమార్తె అమెరికాలో ఉంటుండగా.. కుమారుడు అవినాశ్ MS చేసేందుకు అక్కడికి వెళ్లాడు. అక్క వాళ్ల ఇంట్లోనే ఉంటున్నాడు. వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లిన అవినాశ్.. నీట మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు తానా ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News October 7, 2024

మంత్రి నాదెండ్లను కలిసిన పౌరసరఫరాల శాఖ మెంబర్‌ మోకా

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ మెంబర్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ కో-కన్వీనర్ మోకా ఆనంద సాగర్ అమరావతిలోని సచివాలయం వద్ద రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదవి బాధ్యతలు చేపట్టిన మోకా ఆనంద్ సాగర్‌ను మంత్రి అభినందించారు. అదేవిధంగా ఆయనకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

News October 7, 2024

రంపచోడవరం: CRPF జవాన్ మృతి

image

చింతూరు మండలంలో విషాదం జరిగింది. వేటగాళ్లు పెట్టిన విద్యుత్ వైర్లు తగలడంతో సీఆర్పీఎఫ్ జవాను తిరువాల కారాసు (55) ఆదివారం రాత్రి మృతిచెందాడు. వివరాలు.. డొంకరాయి పరిసరాల్లో రాత్రి 2 గంటలకు కూంబింగ్ విధులు నిర్వర్తిస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 7, 2024

ధవళేశ్వరం బ్యారేజీ UPDATE

image

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఆదివారం రాత్రి 1.62 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలువలకు 14,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులు నీటిమట్టం కొనసాగుతుందని తెలిపారు.