News July 9, 2024
NZB: బాయ్స్ హాస్టల్‌లో యువతి.. విద్యార్థి సస్పెండ్

బాయ్స్ హస్టల్‌లో యువతికి ఓ స్టూడెంట్ 15రోజుల క్రితం ఆశ్రయమిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్సిటీ అధికారుల వివరాలిలా.. టీయూలో విద్యార్థి పీజీ చదువుతూ యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్నాడు. అతను ఓ యువతికి ఆశ్రయమిచ్చిన విషయాన్ని తోటి విద్యార్థులు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఆ స్టూడెంట్‌ని సస్పెండ్ చేశారు.
Similar News
News February 1, 2026
NZB: లెక్క తేలింది.. మిగిలేది ఎవరో?

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల లెక్కను అధికారులు తేల్చారు. శనివారం జరిపిన స్క్రూటినీలో అభ్యర్థుల సంఖ్య తేలింది. 60 వార్డులకు 647 మంది అభ్యర్థులకు సంబంధించి 787 నామినేషన్లు మిగిలాయి. తన అభ్యర్థుల పేర్లను కొన్నింటిని ఖరారు చేయగా కాంగ్రెస్ ఇప్పటికీ అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు. విత్ డ్రా సమయం మరో రెండు రోజులు ఉంది. దీనితో ఎవరు ఉంటారో? రెబల్ చేస్తారో? మిగిలేది ఎవరో? ఉత్కంఠగా మారింది.
News February 1, 2026
NZB: అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు రిషెడ్యూల్

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (1, 3, 5 సెమిస్టర్లు) పరీక్షల షెడ్యూల్‌ను సవరించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ బి. శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 7 నుంచి 28 వరకు జరగాల్సిన పరీక్షలను.. అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ www.braouonline.inలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
News February 1, 2026
ప్రజావాణి తాత్కాలిక వాయిదా: NZBకలెక్టర్

మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున NZB జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. జిల్లా ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.


