News July 9, 2024

గెరిల్లా 450 వచ్చేస్తోంది..!

image

క్రూయిజర్ బైక్స్‌కు కేరాఫ్‌గా నిలిచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో మోడల్ లాంచ్ చేయనుంది. గెరిల్లా 450ని ఈనెల 17న మార్కెట్‌లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హిమాలయన్ 450ని పోలిన ఈ బైక్ ధర ₹2.4లక్షల- ₹2.60లక్షల మధ్య ఉంటుందని అంచనా. 450 CC, 6 గేర్లు, 40bhp, డ్యుయల్ ఛానల్ ABSతో దీనిని డిజైన్ చేశారు. ఇదే ప్రైస్ రేంజ్‌లో (₹2.5L-2.7L) బనెలీ నుంచి ఈనెల 18న 402S కూడా లాంచ్ కానున్నట్లు సమాచారం.

Similar News

News November 14, 2025

రాహుల్, కేటీఆర్‌ ఐరన్ లెగ్స్: బండి

image

TG: బిహార్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పని ఖతమైందని, రాహుల్ గాంధీ ఇక పబ్జీ గేమ్‌కే పరిమితమవుతారని మంత్రి బండి సంజయ్ విమర్శించారు. KTR వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి BRS పతనం కొనసాగుతూనే ఉందన్నారు. దేశంలో రాహుల్, TGలో కేటీఆర్ ఐరన్ లెగ్స్ అని బండి ఎద్దేవా చేశారు. దేశం మొత్తం పోటీ చేస్తామని TRSను BRSగా మార్చిన కేసీఆర్ పత్తా లేకుండా పోయారని, చివరకు ఆ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీగా మారిందన్నారు.

News November 14, 2025

స్థానిక ఎన్నికలు BRSకు అగ్నిపరీక్షేనా!

image

TG: ‘జూబ్లీహిల్స్’ గెలుపు జోష్‌లో ఉన్న CONG అదే ఊపులో లోకల్ బాడీలనూ ఊడ్చేయాలని రెడీ అవుతోంది. త్వరలో రూరల్, అర్బన్ సంస్థల ఎలక్షన్స్ రానున్నాయి. ‘జూబ్లీ’ ఓటమితో నిరాశలో ఉన్న BRSకు ఇవి అగ్ని పరీక్షేనన్న చర్చ ఆ పార్టీలో నెలకొంది. ‘జూబ్లీ’ ప్రభావం స్థానిక ఎన్నికలపై పడుతుందని, ఈ తరుణంలో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నాయకులు, శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపడం సవాలుగా మారుతుందని భావిస్తున్నారు.

News November 14, 2025

సుపరిపాలన, అభివృద్ధి విజయమిది: మోదీ

image

బిహార్ ఎన్నికల్లో విజయంపై PM మోదీ స్పందించారు. ‘సుపరిపాలన, అభివృద్ధి, ప్రజానుకూల స్ఫూర్తి, సామాజిక న్యాయం గెలిచింది. చరిత్రాత్మక, అసమాన గెలుపుతో NDAను ఆశీర్వదించిన బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజలకు సేవ చేసేందుకు, బిహార్ కోసం పని చేసేందుకు ఈ తీర్పు మాకు మరింత బలాన్నిచ్చింది’ అని ట్వీట్ చేశారు. తమ ట్రాక్ రికార్డు, రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే తమ విజన్ ఆధారంగా ప్రజలు ఓటేశారని తెలిపారు.