News July 9, 2024
విశాఖ: మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు

ఏయూ హిందీ ప్రొఫెసర్ సత్యనారాయణపై అందిన ఫిర్యాదు మేరకు ఏమి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ ఈనెల 19న స్వయంగా జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని ఏయూ ఉపకులపతికి కమిషన్ నోటీసు జారీ చేసింది. ఆ రోజు ఉదయం వ్యక్తిగతంగా కాని, తన తరఫున మరో వ్యక్తిగాని 11.30 గంటలకు కమిషన్ ముందు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొంది. గత ఏడాది ఏయూ హిందీ విభాగం ప్రొఫెసర్ లైంగికంగా వేధించారని ఓ మహిళా స్కాలర్ ఫిర్యాదు చేశారు.
Similar News
News January 19, 2026
వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే మెమోలు: కలెక్టర్

విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. అంతకుముందు అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు పరిష్కారం చూపాలన్నారు. జీవీఎంసీలో సాధారణ, టౌన్ ప్లానింగ్ వినతులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్‌కి ఆదేశించారు. అలసత్వం వహిస్తే 2 సార్లు మెమోలు ఇవ్వాలని, మూడోసారి ఛార్జి మెమో ఇవ్వాలన్నారు.
News January 19, 2026
విశాఖ: ఫిర్యాదులు చేసేందుకు ఎవరూ రాలేదు!

ప్రతి సోమవారం జీవీఎంసీలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ 10 గంటలకు ప్రారంభమైనా ఫిర్యాదుదారులు కనిపించలేదు. మరోవైపు అధికారులు కూడా సగానికి పైగా లేకపోవడం విశేషం. అన్ని సీట్లు ఖాళీగా దర్శనం ఇవ్వడంతో వచ్చిన వారు విస్తుపోతున్నారు. పండగ ఎఫెక్ట్ కారణంగా ఈ పరిస్థితి ఎదురైందని పలువురు భావిస్తున్నారు.
News January 19, 2026
గాజువాకలో పండుగ దెబ్బ.. రెచ్చిపోయిన దొంగలు

గాజువాకలోని దొంగలు పండుగ దెబ్బ చూపించారు. 70వ వార్డు ఎల్బీనగర్‌లో ఒకే వరుసులో ఉన్న మూడు ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాజువాక క్రైమ్ సీఐ, ఇతర బృందం చేరుకుని వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఈ మూడు ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ఏం చోరీ జరిగిందనే విషయం తెలియరాలేదు. యజమానులకు పోలీసులు సమాచారం అందించారు. సీసీ పుటేజులు పరిశీలిస్తున్నారు.


