News July 9, 2024

జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో కామారెడ్డి వాసికి స్టేట్ ఫస్ట్

image

హిస్టరీ జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్‌ను కామారెడ్డి వాసి సాధించారు. గాంధారీ మండలం నేరాల్ తండా గ్రామానికి చెందిన బర్దావల్ మేఘరాజ్ నాయక్ జూనియర్ లెక్చరర్‌గా రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించారు. మారుమూల తండాలో పుట్టిన కాయితి లబాన్ బర్దావల్ మేఘరాజ్ ఉత్తమ ప్రతిభ కనబరచడంతో గ్రామస్థులతో పాటు పలువురు అభినందిస్తున్నారు.

Similar News

News February 18, 2026

NZB: అభివృద్ధి తమ లక్ష్యమంటున్న ప్రథమ పౌరులు..!

image

NZB మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ పురపాలక సంఘాల్లో ప్రథమ పౌరులుగా మహిళలే ఎన్నికవ్వడం విశేషం. NZB మేయర్‌గా కూరగాయల ఉమారాణి, బోధన్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా తూము పద్మ, ఆర్మూర్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్‌గా లహరి, భీంగల్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా బొదిరే నాగమణి ఎంపికైన సంగతి తెలిసిందే. వీరందరూ తమ ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపుతామని అంటున్నారు.

News February 18, 2026

నిజామాబాద్‌లో టమాటా ధర ఎంతంటే?

image

నిజామాబాద్‌లో టమాటా ధర బాగా తగ్గింది. హోల్‌సేల్‌లో కిలో రూ.4-5 ఉండగా రిటైల్ మార్కెట్‌లో రూ.10 కిలోగా ఉంది. ఇక బెండకాయ, బీరకాయ రూ.80 కిలో, పచ్చి మిర్చి రూ.70, ఆలుగడ్డలు రూ.20, చిక్కుడుకాయ రూ.40, క్యాప్సికం రూ.60, క్యారెట్ రూ.50, బీట్ రూట్ రూ.50, వంకాయ రూ.40, చామ గడ్డ రూ.50, బిన్నీస్ రూ.80 కిలో, సొరకాయ ఒకటి 10 నుంచి 20 రూపాయలుగా ఉంది. కొత్తిమీర కట్ట రూ.10 నుంచి 20 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.

News February 18, 2026

మోపాల్: చెరువులో పడి పశువుల కాపరి మృతి: SI సుస్మిత

image

చిన్నాపూర్ చెరువులో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మాణిక్యం (38) అనే పశువుల కాపరి మృతి చెందినట్లు మోపాల్ SI సుస్మిత తెలిపారు. నిర్మల్ జిల్లా బైంసా మండలానికి చెందిన మాణిక్యం ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చి కూలీ పనులు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం చెరువులో స్నానానికి వెళ్లి మృతి చెందాడన్నారు.