News July 9, 2024
నిఫ్టీ సరికొత్త రికార్డ్

ఈరోజు సెషన్‌ను లాభాల్లో కొనసాగిస్తున్న నిఫ్టీ 24,400 మార్క్ తాకి సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసింది. 77 పాయింట్ల లాభంతో ప్రస్తుతం 24,397 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 80,260 వద్ద ట్రేడవుతోంది. మారుతీ 6%, ఐటీసీ 2.31% సహా M&M, SBI, బ్రిటానియా షేర్లు చెరో 1% లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది.
Similar News
News November 5, 2025
యూట్యూబ్‌లో నెలకు 6లక్షలు సంపాదిస్తున్న బామ్మ

నచ్చిన పని చేయడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు మహారాష్ట్రకు చెందిన సుమన్ ధమానే. 70ఏళ్లవయసులో ఆప్లీ ఆజీ అనే యూట్యూబ్ ఛానెల్‌ను మొదలు పెట్టిన ఆమెకు ప్రస్తుతం 17.9 లక్షల సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఆ ఛానెల్‌లో ప్రధానంగా సాంప్రదాయ మహారాష్ట్ర వంటకాలే ఉంటాయి. ఆమె మనవడు యష్ సాయంతో ఆమె ఈ కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టి నెలకు 5-6 లక్షల వరకు సంపాదిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
News November 5, 2025
సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు: రాజ్‌నాథ్ సింగ్

ఇండియన్ ఆర్మీని 10% అగ్రవర్ణాలు కంట్రోల్ చేస్తున్నారన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. ‘సైన్యానిది ఒక్కటే మతం. అదే “సైన్యధర్మం”. దానికి ఇంకో మతం లేదు’ అని అన్నారు. ఆర్మీని రాజకీయాల్లోకి లాగొద్దని హెచ్చరించారు. సంక్లిష్ట పరిస్థితుల్లో సైన్యం ధైర్యసాహసాలతో దేశం తలెత్తుకొనేలా చేస్తోందన్నారు. కులమత రాజకీయాలు దేశానికి నష్టం చేస్తాయని పేర్కొన్నారు.
News November 5, 2025
ఏపీ న్యూస్ రౌండప్

✦ రాష్ట్రవ్యాప్తంగా 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ACB తనిఖీలు
✦ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై క్యాబినెట్ సబ్ కమిటీ చర్చ.. సరిహద్దు మార్పులపై నివేదిక రెడీ చేయనున్న మంత్రులు.. NOV 10న క్యాబినెట్ భేటీలో జిల్లాల పునర్విభజనపై చర్చ.. మదనపల్లె, మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాల ప్రతిపాదనలు
✦ నకిలీ మద్యం కేసు CBIకి ఇవ్వాలంటూ హైకోర్టులో జోగి రమేశ్ పిటిషన్.. 12వ తేదీకి విచారణ వాయిదా


