News July 9, 2024
16న ఏపీ కేబినెట్ భేటీ.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ!
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ఈ నెల 16న సచివాలయంలో సమావేశం కానుంది. మరో 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను ఆమోదించే అవకాశం ఉంది. పథకాలు, ఎన్నికల హామీల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ తదితర అంశాలపైనా చర్చ జరుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ నెల 22 నుంచి <<13590883>>అసెంబ్లీ<<>> సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Similar News
News January 18, 2025
ఇంటర్ సిలబస్‌లో మార్పులు?
TG: మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఫిజిక్స్‌లో ఏఐ, రోబోటిక్స్, డేటా సైన్స్ వంటి అంశాలు చేర్చనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు జువాలజీలో కొవిడ్ పాఠ్యాంశాన్ని చేర్చనున్నట్లు సమాచారం. వచ్చే విద్యా సంవత్సరంలోని పుస్తకాల్లో ఈ అంశాలను ప్రింట్ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. మరోవైపు సిలబస్‌ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
News January 18, 2025
నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
AP: సీఎం చంద్రబాబు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వినాయక్ నగర్‌లో మున్సిపల్ కార్మికుడి ఇంటికి వెళ్తారు. ZPHS వరకూ కాలినడకన ర్యాలీలో పాల్గొంటారు. పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు.
News January 18, 2025
వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు?
TG: ఫిబ్రవరి చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26 నుంచి పలు పథకాల అమలు పూర్తైన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని స్థానిక నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. అయితే ఎలక్షన్ కోడ్ లోపు పథకాల అమలు పూర్తి కాకపోతే అది ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపే ఛాన్సుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ కోణంలో ఆలోచిస్తే ఏప్రిల్/మేలో ఎన్నికలు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.