News July 9, 2024
ఖమ్మం: జిల్లాలో సాగర్ కాలువలపై చోరీల కలకలం?

నాగార్జున సాగర్ ప్రధాన కాలువలపై ఉండే క్రాస్ రెగ్యులేటర్ల వద్ద షట్టర్లు ఎత్తేందుకు, దింపేందుకు ఉపయోగించే ఇత్తడి చక్రాలు చోరీకి గురవుతున్నాయని స్థానికులు తెలిపారు. ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలాలు, తనికెళ్ల, ఏన్కూరు, కల్లూరు ప్రాంతాల్లో క్రాస్ రెగ్యులేటర్లున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల అంతటా ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి.
Similar News
News January 30, 2026
ఖమ్మం: 5 మునిసిపాలిటీలు.. 316 నామినేషన్లు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో నిన్నటివరకు 316 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎదులాపురం 87, వైరా 62, సత్తుపల్లి 62, కల్లూరు 76, మధిరలో 29 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీలవారీగా మొత్తం 309 మందికి గానూ BJP 35, CPM 23, కాంగ్రెస్ 114, BRS 124, TDP 2, గుర్తింపున్న పార్టీలు 8, 10 మంది ఇండిపెండంట్లు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నేడు నామినేషన్లకు అఖరిరోజు కావడంతో వీటి సంఖ్య పెరిగే అవకాశముంది.
News January 29, 2026
100% పిల్లల పఠన సామర్థ్యాలు పెంచాలి: జిల్లా కలెక్టర్

100% పిల్లల పఠన సామర్థ్యాలు పెంచాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. గురువారం ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి విద్యాశాఖ అధికారులతో ఎవ్రీ ఛైల్డ్ రీడ్స్ కార్యక్రమంపై సమీక్షించారు. 100% ఇంగ్లీష్ పఠన సామర్థ్యం ఉండాలనే ఉద్దేశంతో రూపొందించిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
News January 29, 2026
ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్ల ఘటం: కలెక్టర్

ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు కీలక ఘట్టమని, నామినేషన్ పత్రాలలో ప్రతీది సరిగ్గా ఉన్నాయో లేవో జాగ్రత్తగా నిబంధనల ప్రకారం చూసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఐదు మున్సిపాలిటీల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని చెప్పారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీచేసే అభ్యర్థుల ప్రకటన ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.


