News July 9, 2024

రేపు ‘తంగలాన్’ ట్రైలర్ రిలీజ్

image

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’ ట్రైలర్ రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 12 సెకన్లు ఉండనున్నట్లు టాక్. పా.రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆగస్టు 15న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Similar News

News July 6, 2025

వర్షంలో తడుస్తున్నారా?

image

కొందరు వర్షంలో తడుసుకుంటూ ఇంటికి వచ్చి యథావిధిగా పనులు చేసుకుంటుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తడిసిన వెంటనే దుస్తులు మార్చుకుంటే శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. దీనివల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ కారకాల నుంచి తప్పించుకోవచ్చు. శరీరంపై యాంటీ బాక్టీరియల్ క్రీమ్ రాసుకోవాలి. టీ లేదా కషాయాలు తాగాలి. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

News July 6, 2025

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

image

AP: శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేశుల నుంచి 1.86 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 67వేల క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 879.30 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు ప్రస్తుతం 180.42 TMCలుగా ఉంది. 2 రోజుల్లో గేట్లు ఎత్తే ఛాన్స్ ఉంది.

News July 6, 2025

చెంచులకు 13,266 ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం చెంచులకు 13,266 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రేపు అచ్చంపేటలోని మున్ననూర్‌లో జరిగే కార్యక్రమంలో చెంచులకు తొలి విడత ఇళ్లను మంజూరు చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఆసిఫాబాద్‌లో 3,371, అత్యల్పంగా నాగార్జున‌సాగర్‌లో 17 ఇళ్లు కేటాయించారు.