News July 9, 2024

తిరుమల ఎక్స్‌ప్రెస్ రద్దు

image

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఆధునీకరణ పనుల కారణంగా విశాఖ నుంచి బయలుదేరే విశాఖ-కడప (17488) తిరుమల ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 5 నుంచి 10 వరకు, తిరుగు ప్రయాణం చేసే కడప-విశాఖ (17487) తిరుమల ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 6 నుంచి 11వ తేదీ వరకు రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజనల్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ తెలిపారు.

Similar News

News November 5, 2025

జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ సక్రమంగా జరగాలి: JC

image

జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేలా చూడాలని జాయింట్ కలెక్టర్ సేథు మాధవన్ అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన సమీక్షలో జేసీ మాట్లాడారు. ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేలా ఆర్డీవోలు, తహశీల్దార్లు జాగ్రత్త వహించాలని సూచించారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. తదుపరి మండల, గ్రామ స్థాయిలో కూడా వెంటనే శిక్షణ జరపాలని ఆదేశించారు.

News November 5, 2025

ప్రైవేట్ దేవాలయాల్లో సీసీ కెమోరాలు తప్పనిసరి: కలెక్టర్

image

ప్రైవేటు దేవాలయాల్లో రోజులో కనీసం వెయ్యిమంది భక్తులు హాజరయ్యే దేవాలయాల వద్ద CC కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులతో ఆలయాల భద్రతపై బుధవారం సమీక్ష జరిపారు. ఆయా మండలాల్లో ప్రైవేట్ ఆలయాలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. కెమెరాల ఏర్పాటును దేవాదాయ శాఖ, రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.

News November 5, 2025

బాడంగి: వేగావతి నదిలో కొట్టుకుపోయిన మహిళ మృతి

image

బాడంగి మండలంలో మహిళ నదిలో కొట్టుకుపోయి మృతి చెందింది. ఆనవరం గ్రామానికి చెందిన అంపవల్లి సంతు (31) కార్తీక పౌర్ణమి సందర్భంగా రోజంతా ఉపవాసం ఉంది. సాయంత్రం వేగావతి నదిలో స్నానానికి దిగింది. నది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయి కారాడ దగ్గర తేలింది. ప్రాణాలతో ఉండటంతో చికిత్స నిమిత్తం బంధువులు బాడంగి CHCకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.