News July 9, 2024
రైతు భరోసా.. ప్రభుత్వం కీలక నిర్ణయం

TG: రైతు భరోసా పథకం విధివిధానాల రూపకల్పనకై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ ఈనెల 10 నుంచి 23వ తేదీ వరకు పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వర్క్ షాప్‌లు నిర్వహించనుంది. 10న ఖమ్మం, 11న ఆదిలాబాద్, 12న మహబూబ్‌నగర్, 15న వరంగల్, 16న మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డిలో వర్క్ షాప్‌లు జరగనున్నాయి.
Similar News
News November 5, 2025
నవంబర్ 5: చరిత్రలో ఈరోజు

1877: సంస్కృతాంధ్ర పండితులు పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి జననం
1925: కవి, రచయిత ఆలూరి బైరాగి జననం
1987: మహాకవి దాశరథి కృష్ణమాచార్య మరణం (ఫొటోలో లెఫ్ట్)
1988: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ జననం (ఫొటోలో రైట్)
2019: నటుడు, దర్శకుడు కర్నాటి లక్ష్మీనరసయ్య మరణం
☛ ప్రపంచ సునామీ దినోత్సవం
News November 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 5, 2025
WTM-2025లో పాల్గొన్న మంత్రి దుర్గేశ్

లండన్‌లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్(WTM)-2025 సమావేశంలో AP పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన స్టాల్, AP పర్యాటక స్టాల్‌ను వివిధ రాష్ట్రాల పర్యాటక మంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రతినిధులతో రాష్ట్రంలో పర్యాటక పెట్టుబడుల అవకాశాలు, టూరిజం ప్యాకేజీల గురించి వివరించారు. AP పర్యాటకానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


