News July 9, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. వనపర్తి జిల్లా దగడలో 58.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోలు 48.0 మి.మీ, గద్వాల జిల్లా రాజోలిలో 46.0 మి.మీ, జడ్చర్లలో 43.0 మి.మీ, నారాయణపేట జిల్లా గుండుమల్ లో 20.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Similar News

News February 13, 2026

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ ముందంజ

image

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. మొత్తం 60 స్థానాలకు గాను 30 డివిజన్లకు లెక్కింపు పూర్తయింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో, బీఆర్ఎస్ 9 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఎంఐఎం 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ స్పష్టమైన అధిక్యంలో కొనసాగుతుంది.

News February 13, 2026

MBNR: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 108 అంబులెన్స్

image

మహబూబ్‌నగర్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 108 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవి కుమార్ జిల్లా మేనేజర్ ఉదయ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులకు లేదా సిబ్బందికి ఏదైనా అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఈ సేవలను వినియోగించుకోవాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

News February 13, 2026

దేవరకద్ర పురపాలికలో తొలి విజయం

image

దేవరకద్ర పురపాలికల్లో ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం నమోదైంది. 12వ డివిజన్‌లో యుగేందర్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 157 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ గెలుపుతో బీఆర్ఎస్ నాయకులలో ఉత్సాహం నెలకొంది. లెక్కింపు కేంద్రం వద్ద కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు.