News July 9, 2024
గ్రాండ్గా అనంత్-రాధిక హల్దీ వేడుక

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల హల్దీ ఫంక్షన్ గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకల్లో రాధిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ధరించిన ఎల్లో లెహంగాపై పూల దుపట్టా హైలెట్గా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా అనంత్-రాధిక వివాహం ఈ నెల 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది.
Similar News
News January 14, 2026
వినాశకర పరిణామాలుంటాయ్.. అమెరికాకు రష్యా పరోక్ష హెచ్చరిక

ఇరాన్లో అమెరికా జోక్యం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యా తెలిపింది. ‘2025 జూన్లో ఇరాన్పై చేసిన దాడిని రిపీట్ చేయాలనుకునేవారు, బయటి శక్తుల ప్రేరేపిత అశాంతిని వాడుకోవాలనుకునేవారు.. అటువంటి చర్యల వల్ల మిడిల్ఈస్ట్లో పరిస్థితులపై, అంతర్జాతీయ భద్రతపై ఉండే వినాశకరమైన పరిణామాల పట్ల అలర్ట్గా ఉండాలి’ అంటూ పరోక్షంగా హెచ్చరించింది. అంతకుముందు ఇరాన్ నిరసనకారులకు సాయం అందబోతోందని ట్రంప్ ప్రకటించారు.
News January 14, 2026
టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

సికింద్రాబాద్, RKపురంలోని <
News January 14, 2026
మోసపోయిన డైరెక్టర్ తేజ కుమారుడు

డైరెక్టర్ తేజ కుమారుడు అమితోవ్ తేజ భారీ మోసానికి గురయ్యారు. ట్రేడింగ్లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి హైదరాబాద్కు చెందిన దంపతులు రూ.63 లక్షలు కాజేశారనే ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. షేర్మార్కెట్ నిపుణులమంటూ పరిచయం పెంచుకున్న అనూష, ప్రణీత్ దంపతులు ఫేక్ ప్రాఫిట్స్ చూపించి నమ్మించారు. లాభాలు రాకపోగా పెట్టిన డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో అమితోవ్ పోలీసులను ఆశ్రయించారు.


