News July 10, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 18, 2025

మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్

image

TG: మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తనకు అప్పగించాలని కోరారు. కాగా మోహన్ బాబు కొన్ని రోజులుగా తిరుపతిలో ఉంటుండగా, మంచు మనోజ్ జల్‌పల్లిలోని ఇంట్లో ఉంటున్నారు.

News January 18, 2025

సుచిర్ బాలాజీ మృతిపై స్పందించిన OpenAI

image

సుచిర్ బాలాజీ మృతిపై చాట్ జీపీటీ మాతృసంస్థ OpenAI స్పందించింది. ఇది తమను షాక్‌కు గురి చేసిందని, విలువైన సభ్యుడిని కోల్పోయామని కంపెనీ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. OpenAI ఉద్యోగి అయిన బాలాజీ సంస్థ అనైతిక కార్యకలాపాలపై గతంలో బహిరంగంగా విమర్శలు చేశారు. ఈక్రమంలోనే ఆయన నవంబర్‌లో శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఫ్లాట్‌లో అనుమానాస్పదంగా మరణించారు. దీంతో తన కొడుకును మర్డర్ చేశారంటూ తాజాగా అతడి తల్లి ఆరోపించారు.

News January 18, 2025

జేసీ ప్రభాకర్ రెడ్డిపై MAAకు నటి ఫిర్యాదు

image

టీడీపీ నేత <<15051797>>జేసీ ప్రభాకర్ రెడ్డిపై<<>> ఫిల్మ్ ఛాంబర్, MAAకు నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. ఆయన తన పట్ల దారుణంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. జేసీ ప్రభాకర్ క్షమాపణ చెబితే సరిపోదని, ఆయనపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై ఫిల్మ్ ఇండస్ట్రీ స్పందించకపోవడంతోనే ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశానన్నారు.